ఎమ్మెల్యేలకు క్లాస్‌లు: హరీష్, ఇబ్బంది అనే: రఘువీరా
హైదరాబాద్: త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలంగాణ మంత్రి హరీష్ రావు శనివారం చెప్పారు. స్పీకర్ ఎన్నికపై అన్ని పార్టీలనూ సంప్రదిస్తున్నామని, ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు సహకరించాలని కోరుతున్నామని చెప్పారు. డిప్పూటీ ఛైర్మన్ మండలి ఛైర్మన్‌గా కొనసాగుతారన్నారు.
ఎమ్మెల్సీలంతా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందన్నారు. 10న మండలికి సెలవు దినమని, 11న అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుందన్నారు. త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇబ్బందులు ఎదురవుతాయనే: రఘువీరా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు అని ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి వేరుగా చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం బహిరంగ సమావేశం కూడా ఉన్నట్లు తెలిసిందని, ఇది తమకు, వాళ్లకు కూడా ఇబ్బంది అవుతుందని భావించి తాను వెళ్లడం లేదని చెప్పారు.
తెలంగాణలో తెరాస పైన, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి పైన ప్రజలు ఆశలు పెట్టుకున్నారని, అవి వమ్ము చేయవద్దన్నారు. విభజన పరిణామాలతో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజకం కలిగే అవకాశం ఉందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేయడాన్ని ఆయన సమర్థించారు. విభజన బిల్లులో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు వీలు కలుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications