తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేకు శిక్షణ (పిక్చర్స్)
హైదరాబాద్: ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు అందులో చెప్పారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని చెప్పారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు కచ్చితమైన ఆధారాలు చూపాలని పేర్కొంది. ప్రతి మండలాన్ని నాలుగు సెక్టార్లుగా విభజించి సర్వే నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
సర్వే నిర్వహించిన రెండు వారాలలోగా డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ మినహాయించి 9 జిల్లాల్లో 14 వేల డాటా ఎంట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. సర్వేకు సంబంధించిన పూర్తి డాటా ఎంట్రీ సెప్టెంబర్ 4వ తేదీకి పూర్తి చేయాలని చెప్పారు.
పూర్తి చేసిన సర్వే వివరాలపై సెప్టెంబర్ 10 నుంచి స్కూట్న్రీ జరుగుతోందని పేర్కొన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉండగా, వారికి ఒక్కొక్క బుక్‌లేట్‌లో 30 సర్వే ఫారాలను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో సర్వే ఫారాలు ఇంగ్లీష్‌లో, గ్రామీణ ప్రాంతాలలో తెలుగులో ఉంటుందని చెప్పారు. కుటుంబ సర్వే నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు.

సర్వేపై శిక్షణ
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే కోసం అధికారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అధికారులు బుధవారంనాడు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సర్వేపై శిక్షణ
అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సమగ్ర కుటుంబ సర్వేపై శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా నిర్వహించిన సర్వేలో అధికారులు ఇలా..

సర్వేపై శిక్షణ
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణ కోసం బుధవారంనాడు నిర్వహించిన సర్వేకు వేలాది మంది అధికారులు హాజరయ్యారు.

సర్వేపై శిక్షణ
తెలంగాణలో నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేలో వివిధ కాలమ్స్ ఉంటాయి. వాటి వివరాలను తెలుసుకుని అధికారులు నింపాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications