సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య రైళ్లు రద్దు..!!

సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధి దువ్వాడ స్టేషన్ లో జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రైళ్ల రాకపోక ల్ల అంతరాయం కలుగుతుందని అధికారులు ప్రకటించారు. ఈ లైన్ లో దురంతో తో సహా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మర్ని కొన్ని రైళ్లను దారి మళ్లించింది. మరి కొన్ని పాక్షికంగా రద్దు చేసారు. రద్దు..దారి మళ్లించిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు.

దువ్వాడ స్టేషన్ లో జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఏడు రైళ్ల ప్రయాణ సమయాలను మారుస్తూ అధికారులు ప్రకటన చేసారు. 14 రైళ్లను పూర్తిగా, 8 పాక్షికంగా రద్దయ్యాయి. సికింద్రాబాద్ - విశాఖ దురంతో ఎక్స్ ప్రెస్ మే 6న, విశాఖ - సికింద్రాబాద్ దురంతో మే 7న రద్దయ్యాయి. విశాఖ - కాచిగూడ సూపర ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ మే 6,7 తేదీల్లో రద్దు చేస్తూ అధికారులు నిర్ణయించారు. నెల 29, మే 6 తేదీల్లో సికింద్రాబాద్‌ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 30, మే 7 తేదీల్లో విశాఖ - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

Trains Cancellation, Short-termination & Rescheduling between Secunderabad - Vizag due to technical works

అలాగే మే 5, 6 తేదీల్లో కాచిగూడ - విశాఖపట్నం, మే 6, 7 తేదీల్లో విశాఖపట్నం - కాచిగూడ రైలును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. 6న బిలాస్‌పూర్‌ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు, 6న సికింద్రాబాద్‌ - విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రద్దు అయింది. గుంటూరు -విశాఖ మధ్య నడిచే రైలు ఈ రోజు నుంచి మే 7వ రకు సామర్ల కోట వరకే నడపనునున్నారు.

అదే విధంగా విశాఖ - గుంటూరు మధ్య నడిచే (17240) ఈ నెల 30 నుంచి మే 8 వరకు సామర్ల కోట నుంచి బయలు దేరి గుంటూరు వస్తుంది. గుంటూరు నుంచి రాయగడ రైలు ఈ రోజు నుంచి మే 6వ తేదీ వరకు తుని వరకే నడపనున్నారు. అదే విధంగా రాయగడ నుంచి గుంటూరు వచ్చే రైలు ఈ నెల 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తుని నుంచి బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+