ఏపీకి రైళ్ళ జాతర..దూసుకురానున్న వందేభారత్, నరసాపురం నుండి మైసూర్ రైళ్ళు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనిచేస్తున్న ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు రైల్వే అభివృద్ధి కోసం శతవిధాల కష్టపడుతున్నారు. మొన్నటికి మొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సికింద్రాబాద్ మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ కోసం రైల్వే బోర్డు చైర్మన్ ముందు ప్రపోజల్ పెట్టారు. ఇక తాజాగా ఏపీ ప్రజలకు రెండు శుభవార్తలు చెప్పారు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.
ఏపీ ప్రజలకు శుభవార్త
నరసాపురం నుండి సికింద్రాబాద్ మీదుగా మైసూర్ వరకు నడిచే ఎక్స్ప్రెస్ రైలుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన నరసాపురం నుండి మైసూర్ కు హైదరాబాద్ మీదుగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు (ట్రైన్ నెంబర్ 07033/ 07034) ఈనెల 19వ తేదీ నుండి ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

నరసాపురం నుండి సికింద్రాబాద్ మీదుగా మైసూరుకు రైలు
ఈ రైలు సేవలు పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నరసాపురం ప్రజలకు మెరుగైన రైలు సేవలు అందించడానికి తాను కేంద్ర మంత్రిగా శతవిధాల కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నరసాపురం నుండి సికింద్రాబాద్ మీదుగా మైసూర్ వెళ్లే ఈ రైలు వారంలో రెండు రోజులు అందుబాటులో ఉంటుందన్నారు.
ఏపీలో ఈ రైలు ఆగే స్టేషన్ లు ఇవే
ప్రతీ శుక్రవారం, సోమవారం ఇది నరసాపురం మీదుగా సికింద్రాబాద్ కు, అక్కడినుండి బెంగళూరు, మైసూరు జంక్షన్ కు చేరుకుంటుందని తెలిపారు. నరసాపురంలో బయలుదేరే ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుండి బెంగుళూరు మీదుగా మైసూర్
సికింద్రాబాద్ నుండి బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు జంక్షన్, అనంతపురం, ధర్మవరం జంక్షన్, హిందూపురం, యలహంక జంక్షన్, బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు సిటీ జంక్షన్, కెంగేరి, మాండ్య రైల్వే స్టేషన్ల మీదుగా మైసూర్ జంక్షన్ చేరుకుంటుందని తెలిపారు.
మరో శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి
ఇదే సమయంలో మరో శుభవార్తను కూడా చెప్పిన కేంద్ర మంత్రి చెన్నై నుండి నరసాపురం వరకు వందే భారత్ రైలు నడపడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని ఇది పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తొలి వందే భారత్ లభించిందని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
చెన్నై నుండి నరసాపురం వరకు వందే భారత్ రైలు
దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఎప్పటి నుంచి రైలు ప్రారంభమవుతుందో ప్రకటిస్తారని పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నరసాపురం వాసులకు మెరుగైన రైలు సేవలను అందించడానికి తన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రికి, రైల్వే అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications