మూణ్ణెళ్లుగా లేని జీతాలు, పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేసిన ఉద్యోగులు, కార్మికులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఈ పనులు ఒక అడుగు ముందుకు పడితే, రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది పరిస్థితి. గురువారం మరోసారి నిర్మాణ పనులు ఆగిపోయాయి.

తాజాగా, ట్రాన్స్‌ట్రాయ్ తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులు, ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వారు నిరసనకు దిగారు. బుధవారమే వారు నిరసనకు దిగారు. గురువారం పూర్తిస్థాయిలో పనులు ఆపేశారు.

సీజ్: అప్పు చెల్లించలేదని ట్రాన్స్‌ట్రాయ్‌కు బ్యాంక్ గట్టి షాక్, 'పోలవరం'పై ఆందోళన

Transstroy employees stopped polavaram project works

దీంతో కాంక్రీటు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తమకు ట్రాన్స్‌ట్రాయ్ జీతాలు ఇవ్వడం లేదని, ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, కార్మిక శాఖ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు, ఇతర వాహనాలు రాకుండా, వెళ్లకుండా రాళ్లు, టైర్లు అడ్డు పెట్టి అడ్డుకున్నారు. ఇటీవలే దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్‌ట్రాయ్‌కు రుణాలు చెల్లించకపోవడంతో దేనా బ్యాంకు షాకిచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు, గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమవేశమైంది. టెండర్ల ఆమోదం అంశంపై చర్చిస్తారు. ట్రాన్స్‌ట్రాయ్ నెల రోజుల పనుల టార్గెట్‌ను చేరుకోలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Transstroy employees stopped polavaram project works. They said that company is not giving salaries for three months.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి