శబరిమల అయ్యప్ప దర్శనం, బుకింగ్ పై దేవస్థానం కీలక ప్రకటన..!!

శబరిబమల దర్శనం, స్పాట్ బుకింగ్ లపై ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి స్పాట్ బుకింగ్​లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలకు భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారిక వెబ్​సైట్​లో ఆన్​లైన్​లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్నవారికే దర్శనానికి అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.

స్పాట్ బుకింగ్ రద్దు
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్​లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. మే 4న జరిగిన దేవస్థానం బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రోజుకు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా అయ్యప్ప దర్శనానికి 80,000 మందిని అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంతకుముందు ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం 10 రోజుల ముందు మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని దేవస్థానం బోర్డు మూడు నెలల ముందు వరకు పెంచింది.

Travancore Devaswom Board has decided to permit not more than 80 000 pilgrims to the hill shrine a day

గత ఏడాది అనుభవాలతో
గతేడాది డిసెంబరులో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని నియంత్రించడంలో దేవస్థానం బోర్డు విఫలమైంది. అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి మండల పూజలు, మకరజ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ సమయంలో ప్రతిరోజూ 1,20,000 మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకుంటారని అంచనా. గత మండల సీజన్​లో భక్తుల తాకిడి మరింత పెరిగింది. దర్శన సమయాన్ని గంట పెంచిన రద్దీని నియంత్రించలేకపోయారు. భక్తులకు కనీస వసతులు కల్పించలేక ఇబ్బందులు పడింది.

Travancore Devaswom Board has decided to permit not more than 80 000 pilgrims to the hill shrine a day

బోర్డు కీలక నిర్ణయం
కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి స్వగృహాలకు పయనమయ్యారు. అప్పట్లో దేవస్థానం బోర్డుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ఏడాది మండల పూజలు, మకరవిళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్​లను దేవస్థానం బోర్డు రద్దు చేసింది. మరోవైపు, తిరువాభరణం ఊరేగింపు, మకరవిళక్కు సమయంలో ఆన్​లైన్ బుకింగ్​ను అనుమతించాలా వద్దా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బోర్డు అధికారులు తెలిపారు. శబరిమలలో రోజువారీ వేతనదారులుగా ఇతర రాష్ట్రాల వారు నియామకంపై బోర్డు చర్చించింది. పూజకు అరలీ పుష్పం వాడకంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+