నేటి నుంచి ఏపీ సరిహద్దుల్లోనూ ఆంక్షలు- సరుకులు, అత్యవసర వాహనాలకే ఎంట్రీ
ఏపీలో కోవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో ఇవాళ్టి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ విధించబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపుల్ని, షాపింగ్‌ను అనుమతిస్తారు. ఆ తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుంది. అదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించబోతున్నారు.
Recommended Video
కోవిడ్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఇకపై సరిహద్దుల్లో రవాణాపై ఆంక్షలు విధించనున్నారు. ఏపీతో తెలంగాణ, ఒడిశా, కర్నాటక, తమిళనాడుకున్న సరిహద్దుల్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయి. కర్ఫ్యూ సమయంలో ఈ సరిహద్దుల గుండా అత్యవసర వాహనాలు, గూడ్స్ వాహనాలు మాత్రమే రవాణాకు అనుమతిస్తారు. మిగతా వాహనాలకు ఎంట్రీ ఉండదు. ఇప్పటికే మద్యనిషేదం దృష్ట్యా సరిహద్దుల గుండా ఏపీలో ప్రవేశించే వాహనాలను తనిఖీలు చేసి పంపుతున్నారు. ఇప్పుడు అసలు ఎంట్రీయే నిషేధిస్తారు.

ఇప్పటికే తమిళనాడులోకి ఏపీ నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలున్నాయి. ఈ పాస్ తీసుకుంటే తప్ప ఏపీవాహనాలు తమిళనాడులోకి ప్రవేశించే అవకాసం లేదు. ఇప్పుడు ఏపీ కూడా ఆంక్షలు విధించడంతో ఏపీ-తమిళనాడు బోర్డర్స్‌లో వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడనుంది. తెలంగాణ, కర్నాటక, ఒడిశా విషయంలో మాత్రం కర్ఫ్యూ సమయంలోనే వాహనాలను అనుమతించరాదని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications