ఆరువేలు లంచం తీసుకొంటూ ఎసిబికి చిక్కిన ట్రెజరీ ఉద్యోగి
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ నుండి ఆరువేల రూపాయాలను లంచం తీసుకొంటుండగా విశాఖ జిల్లా ట్రెజరీ ఉద్యోగి శ్రీనివాస్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.
విశాఖపట్టణం :విశాఖ జిల్లా ట్రెజరీ డిపార్ట్ మెంట్ లో సీనియర్ అకౌంటెంట్ లంచం తీసుకొంటూ ఎసిబి అధికారులకు చిక్కారు.ఓ ఫిర్యాదుదారుడి నుండి ఆరువేల రూపాయాలను లంచం తీసుకొంటుండగా ఆయనను ఎసిబి అధికారులు పట్టుకొన్నారు.ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ కు చెందిన ఆరుమాసాల వేతనాన్ని క్లియర్ చేసేందుకు ఆయన లంచం తీసుకొంటూ దొరికిపోయాడు.
అవినీతి అధికారులపై ఎసిబి అధికారులు దాడులను తీవ్రం చేశారు. లంచం డిమాండ్ చేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని తమకు ఇవ్వాలని ఎసిబి అధికారులు కోరుతున్నారు.
ఇటీవల కాలంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పలువరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ళపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కొందరు దొరికారు. విశాఖ జిల్లాలోనే ఇటీవలే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎసిబి అధికారులకు చిక్కాడు. ఆయన నుండి పెద్ద ఎత్తున నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
విశాఖలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగులు అధికారలకు చిక్కుతున్నారు. లంచం డిమాండ్ చేస్తూ అధికారులు ఎక్కువ అవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాధితులు ఎసిబిని ఆశ్రయిస్తున్నారు.

ఎసిబి అధికారులకు చిక్కిన ట్రెజరీ ఉద్యోగి
విశాఖ జిల్లా ట్రెజరీ ఉద్యోగి జి.శ్రీనివాస్ బుదవారం నాడు ఆరువేల రూపాయాలను లంచం తీసుకొంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు.పెందుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తోన్న వర్మ కు ఇటీవలే రెగ్యులర్ అయింది.అయితే ఆయనకు ఆరుమాసాల వేతనం పెండింగ్ లో ఉంది. అయితే ఈ పెండింగ్ వేతనం ట్రెజరీలో డిపాజిట్ అయింది.అయితే ట్రెజరీలో తన వేతనం కోసం వెళ్ళిన లెక్చరర్ కు ట్రెజరీ ఉద్యోగి శ్రీనివాస్ చుక్కలు చూపాడు. ఈ బిల్లను క్లియర్ చేయాలంటే ఎనిమిదివేల రూపాయాలను లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరకు ఆరువేల రూపాయాలను ఇస్తే బిల్లును క్లియర్ చేస్తానని చెప్పాడు.

ఎసిబిని ఆశ్రయించిన వర్మ
ఆరు మాసాలుగా తనకు రావాల్సిన వేతనం సుమారు 2,70 లక్షలు ట్రెజరీలో జమ అయి ఉంది. దీన్ని రాబట్టుకోవాలంటే ట్రెజరీ ఉద్యోగి శ్రీనివాస్ కు 6వేల రూపాయాలను లంచంగా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి.దరిమిలా జూనియర్ లెక్చరర్ వర్మ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఎసిబి అధికారులు చెప్పినట్టుగానే వర్మ నడుచుకొన్నాడు.

డబ్బులు ఇవ్వనిదే ఫైలు కదల్లేదు
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ వర్మ తన వేతనం డబ్బుల కోసం ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాడు.అయినా ఫలితం లేకపోయింది. చివరకు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారులు చెప్పినట్టుగానే రసాయనాలు పూసిన నోట్లను వర్మకిచ్చి శ్రీనివాస్ కు ఇవ్వాలని కోరారు ఎసిబి అధికారులు. ఎసిబి అధికారులు చెప్పినట్టుగానే ఈ డబ్బులను శ్రీనివాస్ కు ఇచ్చారు వర్మ. వెంటనే వర్మ ఫైల్ ను క్లియర్ చేశాడు.

ఎసిబి నుండి తప్పించుకొనేందుకు శ్రీనివాస్ యత్నం
వర్మ దగ్గర డబ్బులు తీసుకొని శ్రీనివాస్ చకచకా ఫైల్ ను ఎటివో ఆమోదం కోసం తీసుకెళ్ళాడు.అయితే అక్కడే కాపువేసిన అదికారులు ఆయనను శ్రీనివాస్ ను పట్టుకొని ముడుపులు స్వీకరించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అయితే శ్రీనివాస్ ఎసిబి అధికారుల నుండి తప్పించుకొనేందుకు ప్రయత్నించారు.శ్రీనివాస్ ను అరెస్టుచేసి రిమాండ్ కు పంపారు.












Click it and Unblock the Notifications