వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్టీ రిజర్వేషన్లు: గిరిజనులు, మత్స్యకారుల మధ్య ఘర్షణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మత్స్యకారులు చేస్తున్న ఆందోళన శిబిరాన్ని గిరిజనులు శుక్రవారం నాడు దగ్దం చేశారు. తాము కూడ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని వారు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన సందర్భంగా సోమవారం నాడు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకొంది.

Tribals set protest camp of fishermen on fire over ST quota row in Andhra
ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీలు లేదంటూ గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో గిరిజనులు శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. గత 57 రోజులుగా కలెక్టరేట్‌ వద్ద మత్స్యకారులు ఎస్టీల జాబితాలో చేర్చాలని రిలే దీక్షలు చేపడుతున్న శిబిరాన్ని గిరిజనులు ధ్వంసం చేసి కుర్చీలు, బ్యానర్లను తగులబెట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మత్స్యకారులు, బోయ, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్‌ ధనుంజయరెడ్డి జోక్యం చేసుకుని ఐక్యవేదిక ప్రతినిధులతో మాట్లాడారు. డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

ఎస్పీ త్రివిక్రమవర్మ ఆందోళనకారులకు నచ్చజెప్పి ఈ తరహా దాడులు చేపడితే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తాము కూడ ఆందోళనలను కొనసాగిస్తామని గిరిజనులు కూడ ప్రకటించారు.

English summary
Tension prevailed at the Srikakulam collectorate Monday afternoon after the tribal people ransacked the protest camp erected by fishermen communities who have been staging a demonstration for the last 56 days seeking ST status for them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X