88 పైసలషేరు.. రూ.లక్ష రూ.40 లక్షలైంది!!
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారు ఫలానా కంపెనీ షేర్లు కొన్నారని మనం కూడా కొనుగోలు చేసి చేతులు కాల్చుకోవద్దు. షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఆర్థిక నిపుణుల సలహాలు పాటిస్తే ఆదాయం ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని షేర్లు ఊహించని విధంగా పెరుగుతుంటాయి. మరికొన్ని షేర్లు ఒక్కసారిగా కిందకు పడిపోతాయి. అసలు విలువకు ఎన్నో రెట్లు పెరిగే షేర్లను మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు.
డైలీ అప్పర్‌సర్క్యూట్ కొట్టుకుంటూ పోతే వాటిని మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ అంటుంటాం. అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకుందాం. డబ్బులు పెట్టినవారికి అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చింది.. ట్రిడెంట్ లిమిటెడ్. లాంగ్ స్టాండింగ్ లో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు ఏకంగా 3600 శాతం రిటర్న్స్ ఇచ్చింది. పది సంవత్సరాల కిందట ఈ స్టాక్ ధర కేవలం 88 పైసలుగా ఉండేది. ప్రస్తుతం అది రూ.33.65కి చేరడంతోపాటు గత ఐదు సంవత్సరాల్లో 300 శాతానికిపైగా లాభాలు అందించింది.

ఇందులో 10 ఏళ్ల కిందట ఎవరైనా రూ.లక్ష పెట్టుబడి పెట్టి వాటిని అలాగే ఉంచుకుంటే ఇప్పటికి అవి ఏకంగా రూ.40 లక్షలయ్యేవి. ట్రిడెంట్ కంపెనీ మార్కెట్ విలువ 16.91 ట్రిలియన్ కోట్లుగా ఉంది. వస్త్రాలు, కాగితం, రసాయనాలు, నూలు తయారీ వంటి రంగాల్లో వ్యాపారాలు చేస్తోంది. ఎగుమతులద్వారానే అధిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రమోటర్ల వాటా.. 73.19 శాతం. మిగతా వాటా అంతా పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతిలో ఉంది. విదేశీ పెట్టుబడిదారులతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటాలు కలిగివున్నాయి.












Click it and Unblock the Notifications