Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్-ఇన్వెస్టర్ల సదస్సుకు ముందే పెట్టుబడి-వెయ్యి కోట్ల పరిశ్రమ..

ఏపీలో వచ్చే నెల 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించేందుకు సిద్దమవుతున్న వైసీపీ ప్రభుత్వానికి ఇవాళ ఓ పెట్టుబడిదారు వెయ్యి కోట్ల పరిశ్రమ పెడతానంటూ ఆఫర్ ఇచ్చారు

ఏపీలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తోంది. ఈ సదస్సు నిర్వహణతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలనేది ప్రభుత్వ వ్యూహం. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో కర్టెన్ రైజర్ ఈవెంట్లు నిర్వహిస్తూ పెట్టుబడిదారుల్ని రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో రాష్ట్రానికి ఇవాళ ఓ పెట్టుబడిదారు భారీ పెట్టుబడితో పరిశ్రమ స్ధాపనకు ముందుకొచ్చారు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ వరుణ్‌ గుప్తా కలిశారు.ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నట్లు సీఎం ఆయనకు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం జగన్.. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

triveni glass md varun gupta offer to invest rs.1000 cr in ap, met ys jagan with plan

రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో రూ.1000 కోట్ల మూలధన పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్‌ గ్లాస్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని త్రివేణీ గ్లాస్ ఎండీ వరుణ్ గుప్తా ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఆయన సీఎం జగన్ కు వివరించారు.ఈ పరిశ్రమ ద్వారా 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరుణ్ వెల్లడించారు. దీంతో ఆయనకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, ప్రభుత్వ సలహాదారు ఎస్‌.రాజీవ్‌ కృష్ణ కూడా పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+