హైకోర్టు కోనసీమ అల్లర్ల కేసుల ఎత్తివేత..? ఎన్నికల వేళ వైసీపీకి సంకటం!
ఏపీలో జిల్లాల పునర్విభజన సందర్భంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు ఆ తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతంలో అల్లర్లు చెలరేగాయి. ఇందులో మంత్రి విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లను సైతం ఆందోళన కారులు తగులబెట్టారు. అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్ధానికంగా కొన్ని కులాల మధ్య చెలరేగిన ఈ ఆందోళనలు ఆ తర్వాత సద్దుమణిగినా .. ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి.
కోనసీమ జిల్లా ఏర్పాటు సందర్భంగా చెలరేగిన హింసకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఆందోళన కారులపై కేసులు నమోదు చేసింది. వీటిని రాజకీయ కారణాలతో ఆ తర్వాత ఎత్తేసింది. ఈ మేరకు ఆరు జీవోలు జారీ చేసింది. అయితే వీటిలో కేసుల ఉపసంహరణ వెనుక కారణాన్ని మాత్రం పేర్కొనలేదు. దీంతో కేసుల ఎత్తివేతను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ జరపబోతోంది.

కోనసీమ అల్లర్ల సందర్భంగా పోలీసులు నమోదు చేసిన తీవ్ర కేసుల్ని ప్రభుత్వం ఆరు జీవోల ద్వారా ఎత్తివేయడం చెల్లదని డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్ జంగా బాబూరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో హత్యాయత్నంతో పాటు పలు తీవ్ర నేరాలు ఉన్నాయన్నారు. దీంతో ఈ పిల్ పై ప్రభుత్వం హైకోర్టుకు ఏం చెప్పబోతోందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఎన్నికల వేళ హైకోర్టులో ప్రభుత్వం చెప్పే అభిప్రాయం రాజకీయంగా కీలకంగా మారబోతోంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీల జనాభాతో పాటు కాపులు, శెట్టి బలిజల జనాభా కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య కోనసీమ జిల్లా పేరు మార్పుపై అప్పట్లో అల్లర్లు చెలరేగాయి. వీరిలో ఎవరినీ వదులుకునే పరిస్దితి వైసీపీకి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో కేసుల ఎత్తివేతపై ప్రభుత్వం ఎవరికి అనుకూలంగా తన అభిప్రాయం చెప్పబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం హైకోర్టులో చెప్పే అభిప్రాయంలో ఏమాత్రం తేడా ఉన్నా విపక్షాలు దాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications