Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ మెడకు చంద్రబాబు నిర్ణయం ? కౌంటర్ కోరిన హైకోర్టు ! ఏం చేసినా రచ్చే !

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇప్పుడు జగన్ సర్కార్ అభిప్రాయం కోరింది.

ఏపీలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ సర్కార్ మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లబోతోంది. గత ఎన్నికల సమయంలో ఓ అంశంపై తన అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పేసి ఇరుకునపడిన వైఎస్ జగన్.. ఇప్పుడు అదే అంశంపై మరోసారి తన అభిప్రాయం చెప్పాల్సిన పరిస్ధితి తలెత్తింది. అయితే అప్పుడు విపక్ష నేత హోదాలో జనానికి తన అభిప్రాయం చెప్పిన జగన్.. ఇప్పుడు సీఎం హోదాలో తన ప్రభుత్వం తరఫున హైకోర్టుకు తన అభిప్రాయం చెప్పాల్సి వస్తోంది.

ఏపీలో కాపు రిజర్వేషన్లు

ఏపీలో కాపు రిజర్వేషన్లు

ఏపీలో కాపు వెనుక బడిన వర్గాలుగా గుర్తిస్తూ ఐదుశాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీనిపై గతంలో కాంగ్రెస్, టీడీపీతో పాటు పలు పార్టీలు హామీలు ఇచ్చాయి. అయితే వాటిని నెరవేర్చడం సాధ్యం కాలేదు. దీని వెనుక కాపులు బీసీలతో సమానంగా వెనుకబడిన వర్గాలుగా నిరూపించాల్సిన పరిస్దితి ఒకటైతే, రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు కోర్టుల్లో చెల్లుబాటు కాకపోవడం మరో అంశం. దీంతో ఇప్పటికీ కాపు రిజర్వేషన్ల వ్యవహారం డిమాండ్ గానే మిగిలిపోతోంది. అయితే గత చంద్రబాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తోంది.

ఈడబ్ల్యూఎస్ లో 5శాతం కాపులకిచ్చిన చంద్రబాబు

ఈడబ్ల్యూఎస్ లో 5శాతం కాపులకిచ్చిన చంద్రబాబు

గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. 2019 ఎన్నికలకు ముందు దాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి కూడా తెచ్చేసింది. ఈ క్రమంలో ఆ 10 శాతంలో ఐదుశాతం కాపులకు కేటాయిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ ఇస్తామన్న టీడీపీ హామీ నెరవేరడంతో పాటు అప్పటికే తుని ఘటనతో ఆగ్రహంగా ఉన్న కాపుల్ని చల్లార్చినట్లు అయింది. అయితే దీన్ని అప్పట్లో వైసీపీ వ్యతిరేకించింది. అంతే కాదు కాపు రిజర్వేషన్లపై తన అభిప్రాయం చెప్పాల్సిన పరిస్దితుల్లో తన చేతుల్లో లేదని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పిన జగన్ జనాగ్రహం చవిచూశారు. దీంతో కాపు రిజర్వేషన్ల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

 హైకోర్టులో తాజాగా పిటిషన్

హైకోర్టులో తాజాగా పిటిషన్

అయితే కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కనబెట్టేసిన వైఎస్ జగన్.. అలాగని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కూడా చాలాకాలం వరకూ అమలు చేయలేదు. ఆ తర్వాత పెరిగిన ఒత్తిడితో ఈడబ్ల్యూఎస్ కోటా వరకూ అమలు చేసేందుకు ఆదేశాలిచ్చారు. అయితే గతంలో చంద్రబాబు నిర్ణయించిన విధంగా తమకు ఇందులో ఐదుశాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాలని కాపు సంక్షేమ సేన హైకోర్టును ఆశ్రయించింది. దీంతో దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన హైకోర్టు.. ఈ పిటిషన్ విచారణార్హతపై తిరిగి వైఎస్ జగన్ సర్కార్ అభిప్రాయం కోరింది.
దీంతో బంతి తిరిగి జగన్ కోర్టులోకే వచ్చింది.

 జగన్ ఏం చెప్పబోతున్నారు ?

జగన్ ఏం చెప్పబోతున్నారు ?

అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్ విచారణార్హతపై జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంటే చంద్రబాబు ఇచ్చిన విధంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో దాఖలైన పిటిషన్ పై జగన్ సర్కార్ తన అభిప్రాయం హైకోర్టుకు చెప్పాల్సి ఉంది. దీంతో హైకోర్టుకు జగన్ సర్కార్ ఏం చెప్పబోతోందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అసలే ఎన్నికల వేళ ఈ పిటిషన్ కు విచారణార్హత లేదని చెబితే కాపుల నుంచి ఆగ్రహం తప్పదు. అలాగని విచారణ చేయమని కోరితే అప్పుడు బీసీ కులాల నుంచి వ్యతిరేకత తప్పదు. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడినట్లయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+