సోనియాతో భేటీ: వివేక్‌పై వేటుకు కెసిఆర్ జంకు?
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు వివేక్ బ్రదర్స్ కాంగ్రెసు పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైనట్లు భావిస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు వివేక్ సోమవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. దీంతో ఆయన తన సోదరుడు వినోద్‌తో కలిసి తిరిగి కాంగ్రెసు తీర్థం పుచ్చుకుంటారని భావిస్తున్నారు. తాజా పరిణామం నేపథ్యంలో వివేక్ బ్రదర్స్‌పై కె. చంద్రశేఖర రావు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిపై తెరాస వేటు వేసే అవకాశం లేవని అంటున్నారు.
వివేక్ బ్రదర్స్ పోయినా ఫరవాలేదనే పద్ధతిలో కెసిఆర్ వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. వివేక్ సోదరులు తెరాసలో కొనసాగితే కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు ఉంటుందని భావించాలని, లేకపోతే వారు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లినట్టేనని కొందరు తెరాస నేతలు అంటున్నారు. లోగడ పార్టీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారని, ఆమెపై సస్పెన్షన్ వేటు వేసిన కెసిఆర్ వీ సోదరుల విషయంలో ఏం చర్య తీసుకుంటారనే చర్చ పార్టీ ముఖ్యుల్లో జరుగుతోంది.

ఒకవేళ ఎటువంటి చర్య తీసుకోకపోతే ఆయన అనుమతితోనే వారు ఢిల్లీకి వెళ్లినట్లు భావించాల్సి వస్తుందని వారు అంటున్నారు. మరోవైపు విజయశాంతి మాదిరిగా వివేక్ సోదరులపై దూకుడుగా సస్పెన్షన్ వేటు వేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. తెరాసలో ఉన్నప్పటికీ, సాంకేతికంగా వివేక్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీనే. అయితే ఆయన సోదరుడు, పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి జి.వినోద్‌పై సస్పెన్షన్ వేటు వేయవచ్చు.
కానీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం దళితుడనే విధానం నుంచి పక్కకు వెళ్లారనే విమర్శలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ అధినాయకత్వం దళిత వర్గానికే చెందిన వివేక్ బ్రదర్స్‌పై సస్పెన్షన్ వేటు వేసే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications