ఆపరేషన్: తెరాస ఒత్తిడి చేస్తోందా, తెలంగాణ టీడీపీ నేతల విలవిల!?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల పైన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒత్తిడి వ్యూహం అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోందని, దీంతో తెలుగు తమ్ముళ్లు విలవిల్లాడుతున్నారని, ఆపరేషన్ వేధింపు అంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది.
తెరాసలో చేరకుంటే టీడీపీ నేతల వ్యాపారాల పైన ప్రభుత్వం దృష్టి సారిస్తోందని, సోదాలు, విచారణలు అంటోందన్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు నాయకులకు కూడా ఒత్తిళ్లు తప్పడం లేదని పేర్కొంది.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరింత పదనుదేలుతోందని, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని అధికారంలో ఉన్న తెరాస అమలు చేస్తున్న ఈ వ్యూహానికి టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అల్లాడుతున్నారని, దీన్ని టీడీపీ నేతలు ఆపరేషన్ వేధింపు అని పిలుచుకొంటున్నారని పేర్కొంది.
టీడీపీలోని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను తెరాసలోకి రప్పించడానికి రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారని, వ్యాపారాలు ఉన్న వారిపై ఈ వేధింపుల ప్రభావం మరీ అధికంగా ఉందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయని రాసింది.
ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలో ఉన్నవారికి కూడా ఇవి తప్పడం లేదని రాసింది. వారితో పాటు ద్వితీయ శ్రేణి నేతలను కూడా ఎంచుకొని వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు తెస్తున్నారని పేర్కొంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వేధింపులను తట్టుకోలేకపోతున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications