వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్‌ఎస్‌ ఎంపీ సవాల్...సై అన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి : మరో ముగ్గురు సైతం ఛాలెంజ్..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ..ఏపీ అధికార పార్టీ ఎంపీల మధ్య సవాళ్లు..ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. ఇందులో మహారాష్ట్ర ఎంపీ సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ విసిరిన ఛాలెంజ్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి స్వీకరించారు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని..రాగానే సమాధానం చెబుతానని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు. అదే సమయంలో మిధున్ రెడ్డి అంతటితో ఆగలేదు. ఈ వ్యవహారంలోకి మహారాష్ట్ర ఎంపీని సైతం జోక్యం చేసుకొనేలా చేసారు. మరో ఇద్దరు ఎంపీలు ఈ ఛాలెంజ్ కు సిద్దమయ్యారు. ఈ వ్యవహరాన్ని సామాన్యులే కాదు...సెలబ్రెటీలు సైతం ఏం జరుగుతుందా అనే ఆసక్తితో గమనిస్తున్నారు. మిధున్ రెడ్డి అమెరికా నుండి రాగానే దీనికి సమాధానం లభించనుంది.

సంతోష్ వర్సెస్ మిధున్ రెడ్డి..
హరా హైతో భరా హై.. పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది.. అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్‌ ఛాలెంజ్‌ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గతంలో సంతోష్ స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్‌ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్‌ చేశారు. వారందరూ కూడా మొక్కలు నాటారు. ఇలా ఏడాది పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రముఖులతో పాటు సామాన్యులూ భాగస్వామ్యం అయ్యారు. మొక్కలు నాటి, సెల్ఫీ దిగి పోస్ట్‌ చేయడం సోషల్‌ మీడియాలో భారీగా కొనసాగింది. మధ్యలో ఈ లక్ష్యం ఒక కోటికి చేరినప్పుడు మొక్కను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాటారు. ప్రస్తుతం ఈ లక్ష్యం నేటికి రెండు కోట్ల మొక్కలకు చేరటంతో మరో సారి ఎంపీ సంతోష్‌ మొక్క(రెండు కోట్ల) నాటారు. గత ఏడాది తాను నాటిన మొక్క ఏపుగా పెరగటంతో మరోసారి సెల్ఫీ దిగి ట్విటర్‌లో పోస్ట్‌ చేసారు. మరో సారి గ్రీన్ ఛాలెంజ్ చేసారు. దీనికి వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి స్పందించారు.

TRS Rajyasabha member Santosh Kumar Challenge accepted by YCP MP Mithun Reddy and other four members

ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌
ట్విటర్‌లో మళ్లీ గ్రీన్‌ ఛాలెంజ్‌ ట్రెండ్‌ అవుతోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి స్వీకరించారు. ప్రస్తుతం తాను అమెరికా పర్యటనలో ఉన్నానని, తిరిగి రాగానే మొక్కలు నాటి ఫోటోలు పోస్ట్‌ చేస్తానని ఆయన ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా మిథున్‌ రెడ్డి కూడా ఎంపీలు సుప్రియ సులే, శ్రీకృష్ణదేవరాయ, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఛాలెంజ్‌ విసిరారు. దీంతో పాటుగా మరో నలుగురికి ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు. వైస్సార్‌ సీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, సినీనటుడు అఖిల్‌ అక్కినేని, జిఎమ్మార్‌ అధినేత మల్లికార్జున్‌ రావును మొక్కలు నాటాల్సిందిగా సంతోష్‌ కోరారు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఇగ్నిటింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ గ్రీన్‌ ఛాలెంజ్‌ను చేపట్టింది. కాగా, ఇప్పుడు వైపీపీ ఎంపీలు అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత తాము ఈ సవాల్ ను స్వీకరిస్తూ మిగిలిన వారిని భాగస్వాములను చేసేలా వ్యవహరించాలని నిర్ణయించారు. దీంతో..ఏపీలో సైతం ఈ గ్రీన్ చాలెంజ్ రానున్న రోజుల్లో ట్రెండింగ్ కానుంది.

English summary
TRS Rajyasabha member Santosh Kumar Challenge accepted by YCP MP Mithun Reddy and other four members. in continuation onf Green Challenge Santosh cahllenge four MP's representing AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X