థర్డ్ ఫ్రంట్‌కే: కవిత, టిడిపి అంగీరించింది: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డిఎ)కి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము మద్దతు ఇవ్వబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు, పార్టీ నిజామాబాద్ లోకసభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
అయితే, ఫలితాలు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ ప్రాధాన్యత మాత్రం తృతీయ కూటమికే ఉంటుందని ఆమె చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ విజయం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే తెలుగుదేశం పార్టీ ఓటమిని అంగీకరించినట్లుగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రజల తీర్పు తమ వైపే ఉందని, తమ పార్టీదే విజయమని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రేపు చారిత్రాత్మకమైన తీర్పు రాబోతోందని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ తిరుగులేని ఫలితాలు సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో తమ పార్టీదే విజయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీ అధ్య.క్షుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. సీమాంధ్రలో తమ పార్టీ 110కి పైగా అసెంబ్లీ స్థానాలు, 17కు పైగా లోకసభ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications