TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆ టోకన్లు కచ్చితంగా స్కాన్ చెయ్యాలి, లేదంటే !
శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు.శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే టోకన్లు ఇప్పుడు దళారుల చేతికి చిక్కకుండా టీటీడీ ప్లాన్ చేసింది.
లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరు.కావున భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. నడక మార్గంలో శ్రీవారి భక్తులకు ఇచ్చే టోకన్లు భారీ ఎత్తున గోల్ మాల్ జరుగుతోంది గతంలో భక్తులు ఆరోపించారు.

ఇప్పుడు నడక మార్గంలో ఇస్తున్న టోకన్లను భక్తులు కచ్చితంగా 1200వ మెట్టు వద్ద స్కాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. గురువారం నుంచి 1200 మెట్ల దగ్గర టోకన్లు స్కాన్ చెయ్యడం మొదలుపెట్టారు. తిరుమలలో భక్తు రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు పూర్తి అయ్యి పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభం అయినా తిరుమలలో మాత్రం రద్దీ తగ్గడం లేదు. బుధవారం 79,584 మంది భక్తలు శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
31, 848 మంది భక్తలు కల్యాణకట్టలలో తలనీలాలు సమర్పించుకుని శ్రీవారికి మోక్కులు చెల్లించుకున్నారు. బుధవారం హుండీ ఆదారం రూ. 4 కోట్లా 18 లక్షలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో అన్ని కాంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లు బయటకు వచ్చాయి.












Click it and Unblock the Notifications