TTD : తిరుమల భక్తులకు గమనిక.. ఈ నెల 16న ఆ సేవలు రద్దు...
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక.. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలుసా..? జనవరి 16వ తేదిన జరిగే అర్జిత సేవలను రద్దు చేయనున్నట్లు టిటీడి పేర్కొంది. ఈ నెల 16వ తేదిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఈ ఉత్సవాల సందర్భంగా ఆ రోజు జరిగే ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టిటిడి పేర్కొంది.
జనవరి 16న పార్వేట ఉత్సవం. అదేరోజు గోదాపరిణయోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను సమర్పించడం జరుగుతుంది. మధ్యాహ్నం సమయంలో మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వచ్చిన తర్వాత అక్కడ ఆస్థానం పారువేట కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పార్వేట ఉత్సవాల కారణంగా ఆ రోజున జరిగే అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల్‌సేవ, బ్రహ్మోత్సవాలతోపాటు సహస్రదీపాలంకార సేవలను కూడా రద్దుచేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

పార్వేట ఉత్సవం సందర్భంగా... ఆర్జిత సేవలు రద్దు..
తిరుమలలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి పండగలను నిర్వహించనున్నారు. ఈ నెల 14న భోగిపండుగ సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 7 గంటల వరకు ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై ఊరేగించడం జరుగుతుంది. 15వ తేదిన మకరసంక్రాంతి సందర్భంగా సంక్రాంతి తిరుమంజనం నిర్వహిస్తారు. జనవరి 16న ఉదయం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి మేల్‌ఛాట్ వస్త్రాలను ఊరేగించి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 4 నుండి 6.30 గంటల వరకు శ్రీ గోదాకల్యాణాన్నినిర్వహిస్తారు. మరుసటి రోజు అంటే జనవరి 17న పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ ఉత్సవం సందర్భంగా సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఆలయం నుండి రేణిగుంట రోడ్డులోని పార్వేటమండపానికి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు. ఆ తర్వాత అక్కడనుండి తిరిగి ఆలయానికి విచ్చేస్తారు.












Click it and Unblock the Notifications