యాంకర్ శివజ్యోతికి టీటీడీ బిగ్ షాక్..!
యాంకర్ శివ జ్యోతి గురించి గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె చేసిన వీడియో తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో టీటీడీ అందించే అన్నప్రసాదంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రచర్చనీయాంశం అయ్యాయి. తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లిన శివజ్యోతి.. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడి ఉండగా భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి.. ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ కామెంట్ చేశారు.
కాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై తిరుమల భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వివాదం రాజుకోవడంతో శివ జ్యోతి వెంటనే క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. దీంతో సమస్య సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ ఆమె గురించి ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. శివ జ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం నడుస్తోంది. ఆమె ఆధార్ కార్డును టీటీడీ అధికారులు బ్లాక్ చేశారని, దీని వల్ల ఆమె భవిష్యత్తులో తిరుమల శ్రీవారిని దర్శించుకోలేరని సమాచారం.

ఇక శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసినందుకే శివ జ్యోతిపై టీటీడీ ఈ చర్య తీసుకుందని అంటున్నారు. టీటీడీ నిర్ణయం పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సైతం శివజ్యోతి షేర్ చేసిన బాత్‌రూమ్ వీడియోపై వివాదం నెలకొంది. భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
'తీన్మార్' వార్తల్లో "సావిత్రక్క"గా పాపులర్ అయిన ఆమె.. న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. తెలంగాణ యాసతో ప్రేక్షకులకు చేరువై పలు టీవీ షోలలో యాంకరింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ పాపులారిటీ తోనే బిగ్‌బాస్ సీజన్ 3 లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 98 రోజులు హౌస్‌లో ఉండి మేల్ కంటస్టెంట్స్ కి కూడా గట్టి పోటీ ఇచ్చింది.
కాగా ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల మరింత స్థానం సంపాదించుకుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆమె పలు టీవీ షోలు, ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ మంచి ప్రజాదరణ పొందారు. అంతేకాకుండా, ఆమె 'జ్యోతక్క' పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. భర్తతో కలిసి వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉన్నారు.
యాంకర్ శివజ్యోతికి షాకిచ్చిన టీటీడీ
— Tharun Reddy (@Tarunkethireddy) November 26, 2025
ఇంకెప్పుడూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు లేకుండా ఆమె ఆధార్ కార్డు బ్లాక్ చేసిన టీటీడీ అధికారులు
ఇటీవల శ్రీవారి లడ్డుని అవహేళన చేసినట్లు మాట్లాడిన శివజ్యోతి
శివజ్యోతి క్షమాపణలు చెప్పినా వదిలిపెట్టని టీటీడీ
-
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications