వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం- ప్రతి జిల్లాలో కార్యక్రమాలు : టీటీడీ నిర్ణయం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శనభాగ్యం కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. భక్తులుకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తామన్నారు. కళ్యాణకట్ట క్షురకులుకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచామని చెప్పారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం జరుగుతుందని చెప్పారు.

12 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హస్టల్ భవనాలు నిర్మాణం చేస్తామని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, టీటీడీ బోర్డులో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. 500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులకు ఇవ్వనున్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం బోర్డు సభ్యులు కొంత మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

TTD Board many decisions to celebrate Vaikunta Ekadasi, pritority for common devotees

వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. కోవిడ్ నిభందనలు సడలిస్తే...పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తామని ప్రకటించారు. 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారని వివరించారు. వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున:నిర్మిస్తామన్నారు.

ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తామని చెప్పారు. 2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు చేసామని...శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తామని వెల్లడించారు. ఇక హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాని నిర్మించాలని నిర్ణయించారు. భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాని రోడ్డు మార్గంగా అభివృద్ధి పర్చడానికి నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. హిందు దర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని సుబ్బారెడ్డి వెల్లడించారు.

English summary
TTD Board decided to allow pilgirms on vaikunta ekadasi day, memebrs announced donations for children hospital construction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X