TTD: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం - ఫిర్యాదు..!!

Tirumala: తిరుమల లో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. పరకామణి లో భారీ కుంభకోణం జరిగిందంటూ బోర్డు సభ్యుడు ఫిర్యాదు చేయటం సంచలనంగా మారుతోంది. టీటీడీ బోర్డు తాజా సమావేశంలో తిరుమలలో భక్తులకు దర్శనం.. సౌకర్యాల పైన పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి .. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు పైనా సమీక్షించారు. ఇక, బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పరకామణిలో దాదాపు రూ 100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని ఛైర్మన్ కు ఫిర్యాదు చేసారు.

తిరుమలలో పరకామణిలో భారీ కుంభకోణం జరిగిందంటూ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి చేసిన ఆరోపణ సంచలనంగా మారుతోంది. ఈ విషయంలో విచారణ చేసి బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. తిరుమల లోని పరకామణిలో పెద్దజీయర్‌ తరఫున సీవీ రవికుమార్‌ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని భాను ప్రకాశ్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన రహస్యంగా దాదాపు రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని లేఖలో వివరించారు.

TTD Board Member Bhanu Prakash Complaint over Irregularities in Tirumala Parakamani

సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్‌ ద్వారా శరీరంలో రహస్య అర కూడా పెట్టించుకు న్నారని భానుప్రకాష్​రెడ్డి ఆరోపించారు. 2023 ఏప్రిల్ 29న రవి కుమార్ పరకామణి లో శ్రీవారి హుండీ నగదు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారని భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఘటన పైన తాను వెంటనే విజిలెన్స్‌ సహాయ భద్రతాధికారి సతీష్‌కుమార్‌, పోలీసులకు ఫిర్యాదు చేయ గా, రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిందని వివరించారు. కానీ, నిందితుడిని అరెస్ట్ చేయ కుండా అదే సంవత్సరం సెప్టెంబర్​లో లోక్‌ అదాలత్‌లో రాజీకి వచ్చారని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో కొందరు టీటీడీ అధికారులు, పోలీసులు, మరి కొందరు కలిసి రవి కుమార్ ను బెదిరించి రూ 100 కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నారని భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం లో పలువురి ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో, మొత్తంగా విచారణ చేసి వాస్తవాలను వెలికి తీయాలని భాను ప్రకాశ్ రెడ్డి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+