TTD: వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ తాజా నిర్ణయం, అరుదైన ఘట్టం వేళ..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల సౌకర్యాల పెంపు దిశగా టీటీడీ కొత్త కార్యాచరణ అమలు చేస్తోంది. టీటీడీ అమలు చేస్తున్న క్యూ మేనేజ్ మెంట్ సిస్టమ్ కారణంగా జూన్ మాసంలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు. ఏఐ ఆధారిత సేవలను భక్తుల కోసం వినియోగించాలని టీటీడీ భావిస్తోంది. ఇక.. తిరుమల ఆలయంలో వచ్చే వారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వమించనున్నారు. దీంతో.. వీఐపీ బ్రేక్ దర్శనం పైన నిర్ణయం తీసుకున్న టీటీడీ.. భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది.
తిరుమలలో వారంతం కావటంతో భక్తుల రద్దీ కనిపిస్తోంది. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిట్టం ద్వారా భక్తుల సంఖ్య ఎక్కువగా ఎక్కడ ఉందీ... అదే విధంగా ఎక్కడ ఖాళీ ఉందో గుర్తించి తదనుగుణం గా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జూన్ నెలలో నిత్యం దాదాపు 70 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే విధంగా క్యూ లైన్లలో భక్తులకు టీటీడీ నుంచి ప్రత్యేకం గా సేవలు అందిస్తున్నారు. ఇక, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుంచి అందుతున్న సేవల పైన ఫీడ్ బ్యాక్ సేకరించి... అవసరమైన మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు.

ఇక, జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ పర్వదినం ఘనం గా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు టీటీడీ సిద్దమైంది. అదే విధంగా జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ రెండు కార్యక్రమాల వేళ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 16వ తేదీన ఘనంగా నిర్వహించే ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహణ కు ఏర్పాట్లు చేసారు. దీంతో, ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. జూలై 14, 15వ తేదిల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications