TTD:తాజా పరిణామాల వేళ టీటీడీ ఛైర్మన్ సంచలన నిర్ణయం..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శానానికి 24 గంటల సమయం పడుతోంది. వారాంతం తో పాటుగా వరుస సెలవులతో రద్దీ పెరిగింది. అటు టీటీడీ గోశాల కేంద్రం గా కొద్ది రోజులుగా రాజకీయ రభస సాగుతోంది. ఆవుల మరణం పైన రాజకీయ సవాళ్లు - ప్రతి సవా ళ్లు చోటు చేసుకున్నాయి. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి సైతం తీవ్రంగా ఈ అంశం పైన స్పందించారు. దీంతో, ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
వివాదాల వేళ
టీటీడీ నిర్వహించే గో శాలలో అవుల మరణాల పైన వైసీపీ నేత భూమన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇందులో నిజాలు లేవని టీటీడీ ఛైర్మన్ తో సహా.. కూటమి నేతలు చెబుతూ వచ్చారు. రెండు రోజుల క్రితం భూమన - టీడీపీ నేతల మధ్య ఇదే అంశం పైన తిరుపతి కేంద్రంగా సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఇక, ఈ ఘటన పైన స్పందించిన సుప్రీంకోర్టు న్యాయవాది సుబ్రమణ్యస్వామి టీటీడీ ఇచ్చిన ఖండన పైన కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో టీటీడీలో శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలోనూ సుబ్రమణ్య స్వామి సుప్రీంకు వెళ్లారు. ఇక, సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యల పైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.

సుబ్రమణ్య స్వామి తీరు
వైసీపీ హయాంలో గోవుల గడ్డిని తినేశారని నాయుడు ఆరోపించారు. గోవులను ఒంగోలుకు తర లించి కమీషన్లకు అమ్మేశారని వ్యాఖ్యానించారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి దుర్మార్గుడని నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. హరినాథరెడ్డి అక్రమాలు అన్నీ ఇన్నీ కావని మండిపడ్డారు. పిల్ వేస్తామంటూ మమ్మల్ని భయపెడుతున్నారని పేర్కొన్నారు. పింక్ డైమండ్‍పై అనవసర రాద్ధాం తం చేశారని గుర్తు చేసారు. గోశాల రికార్డులన్నీ హరినాథరెడ్డి ఎత్తుకెళ్లారని చెప్పారు. అక్రమాలు బయటపడుతాయని రికార్డులు ఎత్తుకెళ్లారని నాయుడు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యస్వామికి గత ఐదేళ్లలో అన్యాయాలు కనిపించలేదా అని నిలదీసారు. వైసీపీపై సుబ్రహ్మణ్యస్వామి పిల్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
ఏసీబీ విచారణ
టీటీడీ అంటే ఒంటికాలిపై లేచే సుబ్రహ్మణ్యస్వామి నిజానిజాలేంటో తెలుసుకోరా అని నిలదీసారు. గోశాల ఘటనపై నలుగురు సభ్యులతో కమిటీ వేస్తాం.. గోశాలలో ఏం జరుగుతుందో కమిటీ తేలుస్తుందని వెల్లడించారు. వైసీపీ తప్పులను మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ విషయాలన్నీ ముఖ్య మంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన నాయుడు..వైసీపీ హయాంలో గోశాలలో అవినీతిపై ఏసీబీ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఏసీబీ విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును కోరతా నని నాయుడు వెల్లడించారు.












Click it and Unblock the Notifications