శ్రీవారి దర్శనం..వసతి పై భక్తుల ఫీడ్ బ్యాక్, TTD నిర్ణయాలు..!!
Tirumala: తిరుమలలో సంక్రాంతి సెలవుల వేళ రద్దీ పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. డిసెంబర్ 30న మొదలై వైకుంఠ ఏకాదశి దర్శనాలు పూర్తయ్యాయి. ఈ నెల 25న రథ సప్తమి నిర్వహణ కోసం టీటీడీ కార్యాచరణ ఖరారు చేసింది. ఇక.. తిరుమలలో దర్శనం.. వసతి.. సేవల గురించి భక్తుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. తిరుమలలో తీసుకుంటున్న చర్యలను వివరించారు.
తిరుమలలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ చైర్మన్ నాయుడు వెల్లడించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యా లు అద్భుతంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం అందిందన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93 శాతం మంది భక్తులు సంతృప్తిగా ఉన్నారని వివరించారు. ఈ పది రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 7.83 లక్షలుగా చెప్పారు. గత వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.83 లక్షల మంది దర్శించుకోగా ఈ ఏడాది లక్ష మంది భక్తులకు అదనంగా దర్శనాలు చేసినట్లు వివరించారు.

జనవరి 2వ తేది శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డుస్థాయిలో 83 వేల మంది భక్తులకు దర్శనం జరిగిందన్నారు. జనవరి 3వ తేది శనివారం అత్యధికంగా దాదాపు 89 వేల మందికి దర్శనం జరిగినట్లు వివరించారు. అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడంతో సామాన్య భక్తుల్లో సంతోషం వ్యక్తం అయిందని వివరించారు. ఈ పది రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.41.14 కోట్లుగా ఛైర్మన్ వెల్లడించారు. భక్తులకు విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య - 44 లక్షలుగా తెలిపారు. ఈ పది రోజుల్లో 33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ చేసామని చెప్పారు. PAC-1, 2, 3, 4, 5 లో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసారని చెప్పారు. నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన PAC-5 భవనం అందుబాటు లోకి రావడంతో భక్తులకు విరివిగా వసతి సదుపాయం కలిగింన్నారు. సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు అందుబాటులో ఉంచడంతో సౌకర్యవంతంగా భక్తులు గదులు పొందారని వివరించారు.












Click it and Unblock the Notifications