Tirumala Laddu: తిరుపతి లడ్డూ ధర పెరగబోతోందా ? తేల్చేసిన టీటీడీ ఛైర్మన్..!
ఏడు కొండలపై కొలువైన తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదం ధర పెరగబోతున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి. ఈ మేరకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఈ వార్తల సారాంశం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసారం ధర పెరుగుతుందన్న అంచనాలతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. మరోవైపు లడ్డూ ప్రసాదం రేట్లు పెంచడమేంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.
తిరుపతి లడ్డూ ప్రసాదం ధర పెరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టి క్లారిటీ ఇచ్చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని నిష్కపటమైన, బాధ్యతారహితమైన మీడియా ఛానెల్‌లు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు

పవిత్రమైన తిరుపతి లడ్డూ ధరను పెంచాలని టిటిడి ఆలోచిస్తోందని తప్పుడు నివేదికలు వచ్చాయని ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మీడియా నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి మరియు తప్పుడువి అని ఆయన పేర్కొన్నారు. ఈ తప్పుడు మీడియా నివేదికలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాగే లడ్డూ ప్రసాదం ధరలను పెంచే ప్రణాళిక టిటిడికి లేదని పునరుద్ఘాటిస్తున్నానని వెల్లడించారు. దీంతో లడ్డూ ప్రసాదం ధర పెంపుపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది.

Some unscrupulous and irresponsible media channels bent upon tarnishing the image of the Tirumala Tirupati Devasthanams and the Andhra Pradesh government have falsely reported that the TTD is contemplating to hike the price of the sacred Tirupati Laddu. These media reports are…
— B R Naidu (@BollineniRNaidu) October 17, 2025
ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలోనూ ప్రచారాలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే టీటీడీ ఆగ్రహంగా ఉంది. తప్పుడు ప్రచారాలపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసి కేసులు కూడా నమోదు చేయించింది. అయినా ఇప్పటికీ అలాంటి ప్రచారాలు సాగుతుండటంతో చేసేది లేక ఇలా వివరణలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications