టీడీపీ ట్రాప్ లో బీజేపీ ? అమిత్ షాకు వైవీ సుబ్బారెడ్డి ఘాటు కౌంటర్..!
ఏపీలో తాజాగా పర్యటించిన బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా వైసీపీ నాలుగేళ్ల పాలన అవినీతిమయంగా మారిపోయిందంటూ లెక్కలతో సహా విమర్శలకు దిగారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏపీ టూర్ కు వచ్చిన వీరిద్దరూ వైసీపీ సర్కార్ పై చేసిన విమర్శలపై అధికార పార్టీ మండిపడుతోంది.
ఇవాళ విశాఖలోని జ్ఞానాపురంలో ఎర్నిమాంబ దేవాలయం పునర్నిర్మాణ, ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. బీజేపీ హైకమాండ్ టీడీపీ ట్రాప్‌లో పడిందని వైవీ ఆరోపించారు. అందుకే అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వైవీ విమర్శించారు.

మరోవైపు పసుపు కండువా మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వాళ్ళు చెప్పిన మాటలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలకడం దారుణమని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చిత్తశుద్ధితో నడుస్తున్న వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుండేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
అలాగే 2014-19మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని వైవీ మరో సంచలన ఆరోపణ చేశారు. 2014 ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా 20 పార్లమెంట్ సీట్లు ఇమ్మని ఓటర్లను ఎలా అడుగుతారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications