లడ్డూ వివాదంలో బిగ్ టర్న్ - వారే కారణం, కేసు నమోదు..!!
Tirumala: తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన లడ్డూ వివాదం పై విచారణ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. లడ్డూ వివాదం పైన రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇదే సమయంలో టీటీడీ ఈ వ్యవహారంలో పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసింది.
పోలీసు ఫిర్యాదు
టీటీడీ అధికారులు తిరుమలలో నెయ్యి కల్తీ ఘటన పైన పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీ పై ఫిర్యాదు ఇచ్చారు. 10 లక్షల కేజీల నెయ్యి సప్లైకీ ఏఆర్ డైరీకీ ఈ ఏడాది మే 15వ తేదీన సప్లై ఆర్డర్స్ ఇచ్చినట్లు టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళికృష్ణ వెల్లడించారు. జూన్ 12, 20, 25వ తేదీ, జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డైరీ సప్లై చేసిందని వివరించారు.

జూలైలో వచ్చిన నెయ్యి
ఈ తేదీల్లో తిరుమలకు నెయ్యి వచ్చిన సమయంలో ఆడల్ట్రేషన్ టెస్టింగ్ లేకుండా.. గతంలో ఉన్న పాత విధానాలతో టెస్టింగ్ నిర్వహించి,ఆ నెయ్యిని టీటీడీ వినియోగించిందని చెప్పుకొచ్చారు. అయితే,లడ్డూ నాణ్యత పై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్డీబీఎల్ సహకారంతో ఆడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని చెప్పారు. కాగా.. జూలై 6,12 వ తేదీల్లో ఏఆర్ డైరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలోని నెయ్యిని టెస్టింగ్ కోసం ఎన్డీబీఎల్ ల్యాబ్ కు పంపామని వెల్లడించారు.
విచారణ ప్రారంభం
అయితే, ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటేబుల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిందని వివరించారు. కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు జూలై 22, 23, 27వ తేదిల్లో ఏఆర్ డైరీకీ షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నెయ్యిలో తాము ఎలాంటి కల్తీ చెయ్యలేదని సెప్టెంబర్ 4వ తేదీన ఏఆర్ డైరీ టీటీడీకి రిప్లై ఇచ్చిందని చెప్పారు. టీటీడీ నియమ నిబంధనలు ఉల్లంఘించి కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో..ఇప్పుడు ఈ వివాదంలో విచారణ పర్వం ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications