TTD: సిఫారసు లేఖలపై అనూహ్య నిర్ణయం - దర్శనాలపై ఈవో తాజా ప్రకటన..!!
Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు ఇక ఆన్‌లైన్‌లోనే స్వీకరించాలని నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేక పోర్టల్ సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈవో శ్యామలరావు తిరుమలలో వేసవిలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తీసుకో వాల్సిన చర్యల పైన అధికారులకు దిశా నిర్దేశం చేసారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం.. వసతి..సేవల పైన ఈవో కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఆన్‌లైన్‌లోనే సిఫారసు లేఖలు
తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు టీటీడీలో ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల అనుమతిస్తున్నారు. అయితే, బ్రేక్ దర్శనాల కోసం వస్తున్న లేఖలు.. ఒత్తిడి కారణంగా సాధారణ భక్తులకు దర్శనం ఆలస్యం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో, సిఫారసు లేఖలను పరిమితం చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఇక నుంచి ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో, ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపే సిఫారసు లేఖలను ఆన్‌లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

పరిమితి - అనుమతి
వీరి లేఖలు పంపేందుకు ప్రత్యేక పోర్టల్‌తోపాటు యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి తన కోటాలో ఏ రోజు ఎన్ని సిఫారసు లేఖలు ఇవ్వవచ్చో అన్ని మాత్రమే జారీచేసేలా ఈ యాప్ వీలు కల్పిస్తుంది. మ్యాన్యువల్‌గా లేఖలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఏపీలో ఇదే తరహా విధానం అమలవుతున్నది. ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన కోటాకు మించి లేఖలు రాయడం, తీరా అక్కడికి వెళ్లాక ఇబ్బందులు తలెత్తడం వంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. లేఖలను నియంత్రించటం తో పాటుగా తిరుమల కు వచ్చి అవకాశం దక్కని వారు వాగ్వాదాలకు దిగుతున్నట్లు సిబ్బంది అధికారులకు వివరించ టంతో.. ఈ నిర్ణయం అమల్లోకి తెస్తున్నారు.

దర్శనాలపై సూచనలు
ఇక, టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కల్పిస్తున్న సేవలు, భక్తుల నుండి వస్తున్న సూచనలు , ఫిర్యాదులపై సమీక్ష నిర్ హించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలు సంతృప్తికరంగా ఉండేలా చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లలో భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీలో భక్తుల నుండి ఎప్పటిక పుడు సమాచారాన్ని సేకరించి సమగ్ర విశ్లేషణాత్మక నివేదిక రూపొందించాలన్నారు. లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసే కౌంటర్ల వద్ద భక్తులకు ఆలస్యం చేయకుండా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఫిర్యాదుల పరిష్కారం
తిరుమలకు వచ్చే భక్తులకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలపై భక్తుల నుండి అభిప్రాయసేకరణ చేపట్టాలని, తద్వారా వారికి మరింతగా మెరుగైన సేవలు అందించవచ్చని సూచించారు. తిరుమలలో రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. తిరుమలలోని పలు ప్రాంతాలు, కాటేజీలలో పరిశుభ్రతను పెంచేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించి, ఈ యాప్ పై అవగాహన కల్పించి తద్వారా వచ్చే ఫిర్యాదుల ద్వారా సమస్యలను పరిష్కరించి పరిసరాలు మరింతగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా
భక్తులు టిటిడి వసతి గదులను ఎన్ని గంటలకు ఖాళీ చేస్తున్నారు, తిరిగి ఎన్ని గంటలకు గదు ను భక్తులకు కేటాయిస్తున్నారనే సమగ్ర సమాచారం తెలిసేలా సిబ్బందికి యాప్ రూపొందించి, సదరు యాప్ పై అవగాహన కల్పించి భక్తులకు గదుల కేటాయింపులో ఆలస్యం చేయకుండా కేటాయించాలని స్పష్టం చేసారు. తిరుపతిలో భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసిన తర్వాత తిరుమలకు సకాలంలో లగేజీని చేర్చి భక్తులకు అందజేసేలా చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి దర్శనం, వసతి సదుపాయాలు, అన్నప్రసాదాలు, క్యూలైన్లలో సదుపాయాలు, కల్యాణకట్ట, రవాణా, విజిలెన్స్ , పారిశుద్ధ్యం వంటి అంశాల పైన ఈవో కీలక ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications