జగన్ కు క్లారిటీ ఇచ్చేసిన టీటీడీ..! డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే ?

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం తనను లడ్డూ వివాదంతో టార్గెట్ చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటున్న జగన్.. అదే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. ఇవాళ తిరుమలకు చేరుకోనున్న జగన్.. రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకునేందుకు సిద్దమవుతన్నారు. అయితే డిక్లరేషన్ ఇస్తే కానీ దర్శనానికి ఆయన్ను అనుమతించొద్దన్న డిమాండ్ల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవాళ తిరుమల పర్యటనకు వస్తున్న వైఎస్ జగన్ రాత్రికి టీటీడీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. రేపు ఉదయం గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అయితే జగన్ దర్శనం చేసుకోవాలంటే టీటీడీ నిబంధనల ప్రకారం హిందూ మతంపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో గెస్ట్ హౌస్ వద్దే ఆయన నుంచి ఈ మేరకు డిక్లరేషన్ తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతించరాదని నిర్ణయించారు.

ttd decided to allow ys jagan for Tirumala darshan after signing on declaration only

దీంతో ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం గెస్ట్ హౌస్ కు డిక్లరేషన్ పత్రాలు తీసుకెళ్లి జగన్ నుంచి సంతకాలు తీసుకోనున్నారు. ఆయన సంతకం చేసేందుకు నిరాకరిస్తే మాత్రం దర్శనం కుదరదని తేల్చిచెప్పేయబోతున్నారు. దీంతో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయకపోతే దర్శనానికి వెళ్లకుండా అడ్డుకుంటామని ఇప్పటికే బీజేపీతో పాటు హిందూ సంఘాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో తిరుమలకు వైసీపీ నేతలు చేరుకోకుండా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+