శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల క్వాలిటీపై టీటీడీ కీలక నిర్ణయాలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 75,054 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,239 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.72 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

శ్రీవారి అన్న ప్రసాదాల తయారీలో మరింత నాణ్యతను తీసుకుని రావడానికి టీటీడీ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అన్న ప్రసాదం, లడ్డూ తయారీని స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు. నెయ్యి మొదలుకుని అన్నిరకాల ఆహార వస్తువులను వినియోగించేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు.
ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. లడ్డూ, అన్న ప్రసాద తయారీలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను తనిఖీ చేయడానికి తిరుమలలో ప్రత్యేకంగా ఓ ల్యాబొరేటరీని నిర్మించాలని నిర్ణయించారు. దీనికోసం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సహకారాన్ని తీసుకోనున్నారు.
ఎఫ్ఎస్ఏఏఐ ఆధ్వర్యంలో తిరుమలలోనే ఓ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ లాబొరేటరీని ఏర్పాటు చేయడం వల్ల కాంట్రాక్టర్లు పంపించే ఆహార వస్తువుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి వీలు పడుతుందని శ్యామలరావు భావిస్తోన్నారు. ఈ మేరకు ఎఫ్ఏస్ఏస్ఏఐ, టీటీడీ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
లడ్డూ, అన్న ప్రసాదాలను ఎప్పటికప్పుడు చెక్ చేయడం, వంటశాలను ఎప్పటికప్పుడు పరీక్షించడం వంటి చర్యల వల్ల తిరుమలకు వేలాదిమంది శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన ప్రసాదాలను అందజేసినట్టవుతుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఈ సందర్భంగా శ్యామలరావు సూచించారు.












Click it and Unblock the Notifications