సమ్మెకు సిద్ధమైన టీటీడీ ఉద్యోగులు: నోటీసు, హెచ్చరిక
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు.
టీటీడీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలు తిరుమల పరిపాలనా భవనంలో కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్‌కు నోటీసు అందజేశారు. ఈవోను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను వివరించారు.

ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, నగదు రహిత వైద్య సదుపాయం, టీటీడీలో ఖాళీలో ఉన్న పోస్టులను భర్తీ చేయడంతోపాటు శ్రీవారి దర్శనంలో సారూప్యత పాటించాలని కోరారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆగస్టు 16 నుంచి దశలవారీగా ఆందోళనలు చేయనున్నట్లు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications