శ్రీవారి భక్తులకు అలర్ట్ : సర్వదర్శనం టికెట్ల దక్కాలంటే ఇలా చేయండి..!!
తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. కలియుగ వైకుంఠంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తిరుమలతో వైకుంఠ ద్వారా దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్లు పూర్తయ్యాయి. 44 నిమిషాల్లోనే రెండున్నార లక్షల టికెట్లు పూర్తయ్యాయి. దీంతో, ఆఫ్ లైన్ ద్వారా సర్వదర్శన టికెట్ల జారీకి టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో జనవరి 1వ తేదీన సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
రోజుకు 50వేల చొప్పున 10 రోజులకు 5 లక్షల టోకెన్లు జారీ చేయనునట్లు ఈఓ అనీల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇస్తామని చెప్పారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ వెనుకున్న 2,3 సత్రాలు, ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ స్కూల్, బైరాగి పట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్ పల్లి జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిని వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని క్రిష్ణతేజ విశ్రాంతి గెస్ట్ హౌస్ వద్ద రిపోర్టు చేయాలని ఈఓ సింఘాల్ సూచించారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ తో పాటుగా ఎస్వీబీసీ ద్వారా టికెట్ లభ్యతను ముందే తెలుసుకొని తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేయాలని కోరారు. భక్తులు ముందుగా వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా లోకెన్ పైన తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి రావాలని అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. ఇక, జనవరి 1వ తేదీ, 2వ తేదీ ముక్కోటి సందర్బంగా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో, వీఐపీలు ప్రత్యక్షంగా వస్తే మినహా, వారి సిఫార్సు లేఖలను నియంత్రించాలని టీటీడీ నిర్ణయించింది. వైకుంఠ ద్వార దర్శనం జరిగే రోజుల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications