తిరుమల ఘాట్ రోడ్లలో అలా జరగకుండా చూస్తాము, మొబైల్ లో మాట్లాడుతూ వెళితే !

తిరుమల/తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్లి వస్తుంటారు. ఆర్ టీసీ బస్సులు. సొంత కార్లలో తిరుమలకు వెళ్లి వస్తుంటారు. వేలాది మంది భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి వస్తుంటారు. తిరుమలకు వెళ్లే ప్రయాణికులు వాహనాల్లో సంచరించడానికి రెండు ఘాట్ రోడ్ లు ఉన్నాయి.

తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చెయ్యాలని సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని, తిరుమలకు వచ్చి వెలుతున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

 ttdchairman

తిరుమలలోని ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం టీటీడీ పరిపాలనా భవనంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీ పరమేశ్వరరెడ్డి తో పాటు వివిధ శాఖల అధికారులు, టీటీడీ సీనియర్ అధికారులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకున్నది.

డౌన్ ఘాట్ రోడ్డులో 1వ మలుపు, 7వ మైల్, అలిపిరి డౌన్ గేట్, అప్ ఘాట్ రోడ్డులో లింక్ రోడ్డు, సహజ సిద్ధంగా ఏర్పడిన ఆర్చి (గరుడ ఆకారం), దివ్యారామం ప్రాంతాల్లో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్ ఘాట్ రోడ్డులో లాగా డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్స్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.

ఏ రకమైన వాహనాలను ఘాట్ రోడ్డులో నిషేధించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలని, ఘాట్ రోడ్లలో స్పీడ్ లిమిట్ ఎంత?, డ్రైవింగ్ చేసేప్పుడు మొబైల్ వాడకంపై నిషేధం, తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు తెలిపేలా నిరంతరం కర పత్రాలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

 ttd

ఘాట్ రోడ్లలో వాహనాల వేగాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలని, అంబులెన్స్ లు, రెస్క్యూ టీమ్ లు అవసరమైన పరికరాలతో నిత్యం సన్నద్ధంగా ఉండాలని, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ బస్సుల్లో ఆడియో టేపు లు వినిపించే ఏర్పాటు చేయాలని, తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంచాలని, ఘాట్ రోడ్లలో ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ఓవర్ టేక్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ధర్మారెడ్డి అధికారులకు సూచించారు.

ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగిన తక్షణమే రుయాతో పాటు స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఇటీవల నిత్యం ఘాట్ రోడ్లలలో ప్రమాదాలు జరుగుతున్న సందర్బంగా టీటీడీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ సమావేశంలో జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీ ఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ ఎ సీఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, టీటీడీ ఇంజినీరింగ్ సలహాదారు రామచంద్రారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ , బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఆర్ఎం చెంగల్ రెడ్డి, ఇంచార్జ్ ఆర్టీవో రవీంద్ర నాథ్ సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+