శ్రీవారి భక్తుల కోసం TTD కీలక నిర్ణయం- క్యూ లైన్లు, సేవలు..ఇక పై..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు సెలవులు.. వైకుంఠ ద్వార దర్శనాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో భక్తుల సేవలను మరింతగా విస్తరించేందుకు.. పకడ్బందీగా నిర్వహించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యూ లైన్ల నుంచి ఆలయ ప్రాశస్త్యం వరకు భక్తులకు పూర్తి సమాచారం అందంచేలా తాజాగా కొత్త కార్యాచరణ ఖరారు చేసింది.

టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియా లిటీ సహకారం తీసుకోవాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకుని, ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆలయాల శిల్పాలు, చిత్రాలను భక్తులు సెల్ ఫోన్ తో స్కాన్ చేసినట్లు అయితే సంబంధిత పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారు. అదేవిధంగా, తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్ లో అందిస్తున్న తరహాలో భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ తీసుకువచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

ttd-eo-instructed-that-special-officers-should-be-appointed-to-provide-better-facilities-to-devotee

కాగా, టిటిడి అనుబంధ, స్థానిక ఆలయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేం దుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి ఆలయాల అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించి సదరు రెండు అకౌంట్లను ప్రత్యేక అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే అన్నప్రసాదాల కోసం ఉన్న అకౌంట్లను కొనసాగించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సిసిటివీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై టిటిడి సివిఎస్వోతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆలయాలలో సరైన సమయానికి కైంకర్యాలు, వాహన సేవలకు సంబంధించి, ప్రధాన ఉత్సవాల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు, భక్తులకు వైద్యసేవలు, శ్రీవారి సేవకుల సేవలు, పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు, బడ్జెట్, వ్యర్థాల నిర్వాహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+