TTD: తిరుమల బ్రహ్మోత్సవాలకు ఎన్ని లక్షల మంది, ఈవో హ్యాపీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుతీరిన తిరుమలలో శనివారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తే సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహించామని, అందరి సహకారంతోనే అది సాధ్యమైందని, తిరుమలకు వచ్చిన భక్తులు అందరూ తమకు సహకరించారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

శనివారం తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో భక్తులకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేసినట్లే అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహించామని, టీటీడీ, పోలీసులు, విజిలెన్స్, తిరుపతి జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయడం వల్లనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడానికి సాధ్యం అయ్యిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.

TTD EO said that the Brahmotsavam was successful because everyone worked in coordination

సాలకట్ల బ్రహ్మోత్సవాలు చూడటానికి తిరుమలకు వచ్చిన శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసుకున్నామని, భక్తులు కూడా టీటీడీకి పూర్తిగా సహకరించారని ఈవో శ్యామలరావు అన్నారు.. ఈసారి జరిగిన బ్రహ్మోత్సవాలలో 26 లక్షల మంది శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలు, బాదం పాలు, మజ్జిగ, కాఫీ, పాలు అందించామని, నాలుగు లక్షల మంది భక్తులకు వాటర్ బాటిల్స్ అందించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

TTD EO said that the Brahmotsavam was successful because everyone worked in coordination

గరుడ వాహన సేవ రోజు మాత్రమే తిరుమలకు 3 లక్షలా 50 వేల మంది భక్తులు వచ్చారని, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలలో భాగంగా భాగంగా కొండమీద వాహనాల రద్దీని అరికట్టడానికి టీటీడీ, పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారని టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా జరగడానికి భక్తులు కూడా ఎంతో సహకరించారని, ఈ సందర్భంగా శ్రీవారి భక్తులందరికీ ధన్యవాదాలు చెబుతున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+