TTD: శ్రీవారి భక్తులకు గోల్డెన్ ఛాన్స్, ఈ ఏడాది ఒక్కసారే -ముహూర్తం..ప్రత్యేకత..!!

Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి కేటాయించిన సమాయానికి క్యూ లైన్ల లోకి రావాలని భక్తులను టీడీపీ కోరుతోంది. ఇదే సమయంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక.. దర్శనాలు.. సేవల్లోనూ సాంకేతికత తీసుకొచ్చేలా కసరత్తు కొన సాగుతోంది. ఇక, తిరుమలలో విశేష పర్వదినాల వేళ స్వామి వారి ప్రత్యేక దర్శనాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ ఏడాది తిరుమలలో నిర్వహించే అతి పెద్ద పండుగకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రత్యేక సందర్బంలో తిరుమలకు వచ్చేందుకు భక్తులు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

ఈ ఏడాది ఒక్కసారే
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ శ్రీవారి భక్తులు బ్రహ్మోత్సవా ల వేళ.. తిరుమల వైపే చూస్తారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిలికిచేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల తరలి వస్తారు. ఈ ఏడాది ఒక్క సారి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. 2025, సెప్టెంబర్ 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 24వ తేదీన తొలి రోజున మధ్యా హ్నం బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం ధ్వజారోహణం ఉంటుంది. అదే రోజు రాత్రి పెద శేష వాహన సేవ జరగనుంది. సెప్టెంబర్ 25న ఉదయం చిన శేష వాహనం, మధ్నా హ్నం స్నపన తిరుమంజనం, రాత్రి హంస వాహనంపైన శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు.

ttd-finalised-brahmotsavam-2025-dates-significance

మాడ వీధుల్లో
ఇక, సెప్టెంబర్ 26న ఉదయం సింహ వాహనం, రాత్రి ఏడు గంటల నుంచి ముత్యపు పందిరి పైన విహరిస్తూ శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తారు. సెప్టెంబర్ 27న ఉదయం కల్ప వృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనంపైన స్వామి విహరిస్తారు. సెప్టెంబర్ 28న ఉదయం మోహినీ అవతారం లో స్వామి వారు దర్శనమిస్తారు. అదే రోజు రాత్రి గరుడ వాహనం పైన భక్తులకు దర్శనమిస్తారు. కాగా సెప్టెంబర్ 29న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథం, రాత్రికి గజ వాహన సేవలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 30న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్ర ప్రభ వాహనం పైన మలయప్ప స్వామి భక్తులకు దర్శనమీయనున్నారు.

భక్తుల కోసం
అక్టోబర్ 1న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. ఇక, ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన అక్టోబర్ 2న తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు - పల్లకీ ఉత్సవం. తిరుచ్చి ఉత్సవం జరగనుంది. ఆ తరువాత చక్ర స్నానం నిర్వహిస్తారు. రాత్రికి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. దీంతో.. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో తిరుమల రద్దీగా మారనుంది. ఇక.. బ్రహ్మోత్సవాల వేళ తిరుమలకు వచ్చే వారి కోసం ముందుగానే సమాచారం టీటీడీ అందుబాటులో ఉంచింది. ఇక.. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 31న .. అదే రోజున ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+