తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. రెండు, మూడు గంటల్లోనే దర్శనం, సంచలన నిర్ణయాలివే!
టిటిడి పాలకమండలి తిరుమలలో శ్రీవారి భక్తులకు అనేక శుభవార్తలు చెప్పింది. నేడు టిటిడి పాలకమండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలను తీసుకుని సామాన్య భక్తులకు పండుగ లాంటి వార్తని చెప్పింది. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. కంపార్ట్మెంట్లలో భక్తులు ఇబ్బంది పడకుండా త్వరితన స్వామివారి దర్శనం కల్పించేందుకు తగినట్టు ప్రణాళికలను రూపొందించింది.
సామాన్యులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనాలు
టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మొదటి సమావేశంలోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం ఈరోజు జరిగింది. సమావేశం అనంతరం టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో 20, 30 గంటల పాటు వేచి ఉండాల్సిన దర్సనాన్ని రెండు, మూడుగంటల్లోపే పూర్తి చేసేలా ప్రయత్నం చేస్తామన్నారు.

శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పేరు మార్పు.. డంపింగ్ యార్డ్ పైనా
టిటిడిలో పనిచేస్తున్న అన్యమతస్తులను వి.ఆర్ లేకుంటే ప్రభుత్వ శాఖలకు పంపిస్తామన్నారు. మూడు,నాలుగు నెలల్లో తిరుమలలోని డంపింగ్ యార్డును తరలిస్తామని..శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పేరును గరుడవారధిగా మారుస్తున్నామన్నారు. అలిపిరి సమీపంలో కొండకు సమీపంలో నిర్మితమవుతున్న ముంతాజ్ హోటల్ పనులు వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.
శ్రీవాణి ట్రస్టు పేరు రద్దు
హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ముంతాజ్ హోటల్ నిర్మాణం జరగడం సమంజసం కాదన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని..మాట్లాడితే కేసులు పెడతామన్నారు. ప్రతి నెలలో మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పిస్తామని..శ్రీవాణి ట్రస్టు పేరును రద్దు చేసి..నేరుగా టిటిడి అకౌంట్ లోకి డబ్బులు జమయ్యేలా చేస్తామన్నారు.
శారద పీఠ భవనాలు కూల్చివేత నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన బ్రహ్మోత్సవ బహుమానంను 15,400కు పెంచుతున్నామని..అలాగే
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 7,530కి పెంచుతున్నామన్నారు. అలాగే తిరుమలలో వైసిపి హయాంలో శారద పీఠానికి కేటాయించిన భూముల రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది అలాగే స్థలంలో పీఠం నిర్మించిన బిల్డింగ్ ని కూల్చివేయాలని కూడా నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి ప్రసాదాలపై కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు
టిటిడి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్నారు.అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్ ను భక్తులకు వడ్డించాలని టిటిడి బోర్డు నిర్ణయించింది. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఇక టూరిజం శాఖ కేటాయిస్తున్న 4 వేల ఎస్ ఈ డి టికెట్లు రద్దు చేస్తూ టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు సంచలన నిర్ణయాలను వెల్లడించారు












Click it and Unblock the Notifications