తిరుమలలో ఆ భక్తుడు తన నాలుకను తానే కొరుక్కున్నాడు: టీటీడీ

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 69,609 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 33,144 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.11 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

TTD has condemned a fake post on Laddu Prasadam

అన్ని విభాగాల అధికారుల స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా టీటీడీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంత‌రాయంగా అన్నప్రసాదం, మంచినీటిని అందజేసే ఏర్పాట్ల‌ు చేసింది.

తిరుమల లడ్డూ ప్రసాదంపై మరోసారి వివాదం తలెత్తింది. తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్‌ అనే భక్తుడు తాజా ఆరోపణలు చేశారు. ఈ నెల 8వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు నోటిలో గాయమైందని చెప్పారు.

రక్తస్రావం కావడంతో తాము వెంటనే స్పందించామని, నవీన్ కుమార్ ను అంబులెన్సు ద్వారా తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించామని తెలిపింది. అక్కడ వైద్య పరీక్షలను నిర్వహించామని పేర్కొంది. అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించింది టీటీడీ.

ఆ భక్తుడు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తినేటప్పుడు తన నాలుకను తానే కొరుక్కున్నట్లు ఈ వైద్య పరీక్షల్లో తేలిందని టీటీడీ వెల్లడించింది. నాలుక కింద భాగంలో చిన్నపాటి గాయం అయినట్లు రిపోర్ట్స్ వచ్చాయని పేర్కొంది. అయినప్పటికీ- టీటీడీ వద్ద నష్ట పరిహారం పొందాలనే దురుద్దేశంతో నవీన్ కుమార్ లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. ప్రజలను గందరగోళపరిచేలా ఇలాంటి దురుద్దేశపూరిత చర్యకు పాల్పడిన ఆ భక్తుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+