TTD: వేసవి రద్దీ వేళ దర్శనం, వసతిపై ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన..!!

Tirumala: వేసవిలో తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా శ్రీ‌వారి భ‌క్తుల కోసం వేసవిలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామ‌ని టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి తెలిపారు. మార్చి 20 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వీఐపీ దర్శనాలు తగ్గింపు: ఫిబ్రవరి 16న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారని ధర్మారెడ్డి తెలిపారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయన్నారు. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారని వివరించారు.

TTD has decided to reduce VIP break Srivani during the summer holidays From April to July

వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామని ధర్మారెడ్డి స్పష్టం చేసారు. ఏప్రిల్‌ నుండి జూలై వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లు తగ్గించామని వెల్లడించారు.

వసతి పై కీలక నిర్ణయం: తిరుమలలో దాదాపు 7500 గదులు ఉన్నాయన్నారు. వీటిలో 45 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉందని చెప్పారు. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నట్లు ధర్మారెడ్డి స్పష్టం చేసారు. వేసవిలో తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైనంత వసతి సౌకర్యం లేనందున భక్తులు తిరుపతిలో వసతి పొందాల్సిందిగా కోరారు.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న పాత మ్యూజియంలో ఫిబ్రవరి 29వ తేదీ నుండి భక్తులకు నిత్యాన్నదానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. - శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం(చిన్నపిల్లల గుండె ఆసుపత్రి) ప్రారంభమైన రెండేళ్ల కాలంలోనే 12 గుండె మార్పిడి ఆపరేషన్లు, 2485 గుండె ఆపరేషన్లు చేసారని వివరించారు. స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి జనరల్‌ ఆసుపత్రిలో మార్చి 1వ తేదీ నుండి నగదు రహిత వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

తిరుమలలో ఉత్సవాలు: స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి జనరల్‌ ఆసుపత్రిలో మార్చి 1వ తేదీ నుండి నగదు రహిత వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. మార్చి 20 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 8న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వ దినం నిర్వహించనున్నారు.

మార్చి 25న తుంబురుతీర్థ ముక్కోటి నిర్వహిస్తారు. మార్చి 8వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించ నున్నారు. మార్చి 8 నుండి 16వ తేదీ వరకు - హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+