గరుడసేవకు భారీ బందోబస్తే, వేల సంఖ్యలో సీసీటీవీలు, 2 లక్షల మంది !

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి (ttd) కొలువు తీరిన తిరుమలలో (tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) భాగంగా సెప్టెంబరు 22న శుక్ర‌వారం జ‌రుగ‌నున్న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌక‌ర్యార్థం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది.

దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో (tirumala)వేచి ఉండే అవ‌కాశ‌ముందని టీటీడీ అధికారులు అంచనా వేశారు.

గరుడ సేవ దర్శనం కోసం (tirumala)ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవిందనిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేప‌ట్టారు. గరుడ వాహనాన్ని (tirumala) రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ (brahmotsavam) దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు క‌దిలేలా ప్ర‌ణాళిక రూపొందించారు.

TTD

గ‌రుడ‌సేవ ద‌ర్శ‌నం (brahmotsavam) కోసం బయట వేచి ఉండే భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాల‌ని టీటీడీ (ttd) కోర‌డ‌మైన‌ది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో (tirumala)శుక్రవారం ఉదయం 8 నుండి అర్దరాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం అని టీటీడీ అధికారులు తెలిపారు.

గ్యాల‌రీల్లోనూ (tirumala) ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు పులిహోర, టమోటా బాత్‌, బిసిబెళాబాత్‌ తదితర అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. శ్రీవారి భ‌క్తుల కోసం 2.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఆలయ నాలుగుమాడవీధుల్లో (tirumala) పరిశుభ్రత, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక శ్రద్దలు తీసుకున్నారు.

 Garuda Seva

బ్రహ్మోత్సవాల (brahmotsavam) రోజుల్లో అదనంగా 247 మంది, గరుడసేవ నాడు అదనంగా మరో 774 మందిని ఏర్పాటు చేశారు. భక్తుల కోసం నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 524 తాగునీటి డ్రమ్ములను ఏర్పాటుచేసి శ్రీవారి (ttd) సేవకుల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు (brahmotsavam) దాదాపు 1130 మంది టీటీడీ (tirumala)నిఘా మరియు భద్రతా సిబ్బందితోపాటు 3,600 మంది పోలీసులతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

గరుడసేవకు (tirumala) ప్రత్యేకంగా 1, 200 మంది పోలీసులతో అదనపు భద్రత క‌ల్పించారు. ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,770 సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (brahmotsavam) నుండి పర్యవేక్షిస్తారు. ఘాట్ రోడ్ల‌లో (tirumala) భ‌క్తుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని గురువారం సాయంత్రం 6 గంట‌ల నుండి సెప్టెంబ‌రు 23వ తేదీ శ‌నివారం ఉదయం 6 గంట‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల‌ను టీటీడీ నిషేధించింది.

తిరుప‌తిలోని (tirumala) అలిపిరి పాత చెక్ పాయింట్ వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలను పార్క్ చేసుకునే స‌దుపాయాన్ని టీటీడీ కల్పిస్తోంది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టీటీడీకి స‌హ‌క‌రించాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది. ఆర్‌టీసీ బస్సుల్లో 3 వేల ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మంది భక్తులను తరలించేందుకు (tirumala) అధికారులు చర్యలు చేప‌ట్టారు.

భ‌క్తుల‌కు వైద్య‌సేవ‌ల కోసం మాడ‌వీధుల్లో (tirumala)నాలుగు మూల‌ల్లో మొబైల్ క్లినిక్‌లు, 7 అంబులెన్సులు, డాక్ట‌ర్లు, పారామెడిక‌ల్ సిబ్బంది ఏర్పాటు చేస్తారు.

 Garuda Seva

గరుడసేవ నాడు (tirumala) వాహనసేవను తిలకించేందుకు (brahmotsavam) మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి గృహం, అన్నదానం కాంప్లెక్స్‌, రాంభగీచా విశ్రాంతి గృహం, ఫిల్టర్‌ హౌస్‌ ఇతర ప్రాంతాల్లో కలిపి 20 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+