TTD: అమల్లోకి నూతన టోకెన్ విధానం, దర్శనం - సమయం మార్పు..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు దర్శనం.. టోకెన్ విధానం..వసతి విషయంలో మరింత మెరుగైన విధానాలను అమలు చేసేందుకు టీటీడీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఏ రోజుకారోజు శ్రీవాణి దర్శనం అమలుకు నిర్ణయించిన టీటీడీ ఈ రోజు నుంచి ఈ కొత్త విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. 15వ తేదీ వరకు పరిశీలన చేసిన తరువాత సమీక్ష చేయనుంది. ఈ విధానం పైన భక్తుల నుంచి శ్రీవారి సేవకులు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
తిరుమలలో ఇకపై శ్రీవారి భక్తులకు ఏ రోజుకారోజు శ్రీవాణి దర్శనమ్ అమలు కానుంది. ఈ రోజు నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు ఈ నూతన విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అదే విధంగా శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్ లైన్ లో పొంది శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వారి దర్శన సమయాల్లో మార్పులు చేసారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం వలన శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా మూడు రోజుల సమయం పట్టేది. దీంతో, వారికి మరింత సౌకర్యకంగా ఉండేలా ఏ రోజు కా రోజు టికెట్ జారీ తో పాటుగా దర్శనం కల్పించడం గురించి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

తాజా నిర్ణయం మేరకు తిరుమలలో ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన టికెట్ల జారీ చేస్తున్నారు. టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు రిపోర్టింగ్ సమయంగా డిసైడ్ చేసారు. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుండి దర్శన టికెట్లు కోటా ఉన్నంతవరకు జారీ చేయాలని నిర్ణయించారు. యథావిధిగా తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబర్ 31వ తేది వరకు ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతించునున్నారు.
నవంబర్ 1వ తేది నుండి శ్రీవాణి టికెట్లను ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. భక్తులు ముందుగా కౌంటర్ల వద్దకు చేరుకుని తాము ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేయు ప్రదేశం వద్దకు చేరుకోవాలని సూచిస్తున్నారు. ఈ నూతన విధానం తో భక్తులు వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటు కలగనుంది.












Click it and Unblock the Notifications