శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంపు
Ugadi 2024: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. గురువారం నాడు 62,549 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 26,816 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.33 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
అదే రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల వల్ల మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంటూ ఉంటుంది. ఈ దఫా ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు టీటీడీ అధికారులు. ఏ ఒక్క భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండబోదని హామీ ఇస్తోన్నారు. ఎంత రద్దీ ఉన్నప్పటికీ సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేస్తోన్నారు.
ఇందులో భాగంగా- సర్వ దర్శనం టోకెన్ల సంఖ్యను భారీగా పెంచారు. ఇప్పుడు జారీ చేస్తోన్న వాటి కంటే అదనంగా మరో 30,000 టోకెన్లను ఇస్తోన్నారు. దీనివల్ల 30 వేల మంది సామాన్య భక్తులు ఉచితంగా స్వామివారిని దర్శించుకునే వెసలుబాటు కల్పించారు.
అలాగే- భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలో లడ్డూ కౌంటర్ల సంఖ్యనూ పెంచారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 60 కౌంటర్ల ద్వారా లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందజేస్తోన్నారు. రద్దీని నివారించడానికి దీనికి అదనంగా మరో 15 కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.












Click it and Unblock the Notifications