అక్టోబరు 12 నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు- ఈ సారి ప్రత్యేకతలు..!!

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అప్డేడ్. నవరాత్రి బ్రహ్మోత్సవాల ముహూర్తం.. ప్రత్యేకతలను టీటీడీ ప్రకటించింది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. సాలికట్ల బ్రహ్మోత్సవాలు ముగిసాయి. ఇక, అక్టోబర్ 12వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి వాహన సేవలతో పాటుగా బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు దర్శనాలు.. సదుపాయాల పైన టీటీడీ కసరత్తు మొదలు పెట్టింది. ఇదే సమయం లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేలా టీటీడీ నిర్ణయించింది. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు. ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది. అక్టోబరు 11 - అంకురార్పణం - రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. అక్టోబరు 12 - బంగారు తిరుచ్చి ఉత్సవం - ఉదయం 9 గంటలకు కొనసాగుతుంది.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
ttd-is-organising-the-grand-srivari-navaratri-brahmotsavam-fete-from-october-12-20-during-dasara

వాహన సేవలు.. భారీ ఏర్పాట్లు

కాగా, అదే రోజు పెద్దశేష వాహనం - రాత్రి 7 గంటలకు ఉంటుంది. ఇక.. అక్టోబరు 13 - చిన్నశేష వాహనం - ఉదయం 8 గంటలకు, హంస వాహనం - రాత్రి 7 గంటలకు నిర్వహిస్తారు. అక్టోబరు 14 - సింహ వాహనం - ఉదయం 8 గంటలకు, ముత్యపుపందిరి వాహనం - రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నారు. అక్టోబరు 15 - కల్పవృక్ష వాహనం - ఉదయం 8 గంటలకు, సర్వభూపాల వాహనం - రాత్రి 7 గంటలకు ఉంటుందని వెల్లడించారు. అక్టోబరు 16 - మోహినీ అవతారం - ఉదయం 8 గంటలకు, గరుడ వాహనం - సాయంత్రం 6.30 గంటలకు ఉండనుంది. అక్టోబరు 17 - హనుమంత వాహనం - ఉదయం 8 గంటలకు, పుష్పక విమానం - సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తారు. గజ వాహనం - రాత్రి 7 గంటలకు, అక్టోబరు 18 - సూర్యప్రభ వాహనం - ఉదయం 8 గంటలకు ఉండనుంది. చంద్రప్రభ వాహనం - రాత్రి 7 గంటలకు, అక్టోబరు 19 - స్వర్ణరథం - ఉదయం 7 గంటలకు, అశ్వ వాహనం - రాత్రి 7 గంటలకు జరగనుంది. అక్టోబరు 20 - చక్రస్నానం - ఉదయం 6 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+