తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి గర్భాలయంలోకి మనవడిని తీసుకెళ్లిన రమణదీక్షితులు: నోటీసులు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు సంజాయిషీ నోటీసులు జారీ అయ్యాయి. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా తన మనవడిని స్వామివారి గర్భాలయంలోకి తీసుకెళ్లారనే అభియోగంపై ఆలయ డిప్యూటీ ఈవో కోదండ రామారావు నోటీసులు జారీ చేశారు.

నిబంధనలు అతిక్రమించినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8న హనుమంత వాహనసేవ జరిగింది. ఆ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో మనవడిని వెంటపెట్టుకుని కులశేఖరపడిని దాటుకుని గర్భాలయంలోకి తీసుకెళ్లారు.

TTD issued a notice to Ramana Deekshitulu

అంతేగా, అడ్డుకునే ప్రయత్నం చేసిన అధికారులు, అర్చకులపై మండిపడ్డారనే ఫిర్యాదులు దేవస్థానం యాజమాన్యానికి అందాయి.

ఈ నేపథ్యంలో నోటీసు అందుకున్న మూడు రోజుల వ్యవధిలోపే (నవంబర్ 3 లోపు) తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సంజాయిషీ నోటీసులపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై సమాధానంపై ఆసక్తి నెలకొంది.

English summary
TTD issued a notice to temple priest Ramana Deekshitulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X