తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస నారాయణ దీక్షితులు కన్నుమూత
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస నారాయణ దీక్షితులు(75) సోమవారం కన్నుమూశారు. మిరాశి కుటుంబానికి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు నారాయణ దీక్షితులు ఇటీవల కరోనాబారినపడి చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
మిరాశి కుటుంబాలకు ప్రభుత్వం పదవీ విరమణను రద్దు చేయడంతో నెల క్రితమే నారాయణ దీక్షితులు తిరిగి టీటీడీ విధుల్లో చేరారు. మళ్లీ శ్రీవారి సేవలు తరించేందుకు అవకాశం దొరికిందన్న తరుణంలో కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడటంతో కుటుంబసభ్యులు నారాయణ దీక్షితులును తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సోమవారం ఆరోగ్యం క్షీణించి ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. నారాయణ దీక్షితులు మృతి పట్ల టీటీడీ ఉన్నతాధికారులు, శ్రీవారి ఆలయ మిరాశి కుటుంబసభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
శ్రీనివాస నారాయణ దీక్షితులు మృతి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. కాగా, ఇప్పటికే పలువురు టీటీడీ అధికారులు, సిబ్బంది, అర్చకులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,15,275 నమూనాలను పరీక్షించగా.. 18,972 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా నమోదైన 18,972 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,63,994కి చేరింది.
గత 24 గంటల్లో కరోనా బారినపడి 71 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా 9 మంది చొప్పున కరోనాతో మరణించగా, అనంతపురం, కర్నూలులో ఏడుగురు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో మరణించారు. తాజా మరణాలతో ఇప్పటి వరకు నమోదైన మరణాలు సంఖ్య 8207కు చేరింది.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 10,227 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 10,03,935కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,51,852 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,67,18,148 కరోనా నమూనాలను పరీక్షించారు.
Recommended Video
-
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
దర్శనం, టోకెన్ల జారీ, క్యూ లైన్లలో టీటీడీ కీలక మార్పులు- ఈ తేదీ నుంచి అమలు..!! -
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం












Click it and Unblock the Notifications