వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టీటీడీ కీలక సూచనలు..!!

కొత్త సంవత్సరం ప్రారంభ వేళ తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నెల 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో ఇక స్వామి వారికి సుప్రభాతం స్థానం తిరుప్పావై పఠించాలని నిర్ణయించారు. అదే విధంగా వచ్చే నెల లో రానున్న వైకుంఠ ఏకాదశి వేళ వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు. ⁠దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదని వెల్లడించారు.

TTD making arrangements for Vaikuntha Dwara Darshan at Tirumala Temple from January 10 to 19

అదే విధంగా ⁠చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ⁠ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ⁠భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ⁠గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి స్తామని అధికారులు స్పష్టం చేసారు.

⁠భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ⁠మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించ కూడదని డిసైడ్ అయ్యారు. 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు. ⁠3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమై న మేరకు యువ స్కౌట్స్&గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+