తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: తిరుమల శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు ఏమౌతున్నాయంటే ?, రెండు బ్యాంక్ అకౌంట్లు, యాజమాన్యం క్లారిటీ !

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి భక్తులు రెండు విధాలుగా రెండు వేర్వేరు ఖాతాల్లోకి నగదు జమ చేస్తారని టీటీడీ తెలిపింది.

|
Google Oneindia TeluguNews

తిరుమల/తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన శ్రీవాణి ట్రస్ట్ విరాళాలకు సంబంధించిన కార్పస్ మరియు జనరల్ డొనేషన్ అకౌంట్లో ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించిన వాస్తవాలను టీటీడీ ఖండించింది.

శ్రీవాణి ట్రస్ట్ కు రెండు అకౌంట్ లు

శ్రీవాణి ట్రస్ట్ కు రెండు అకౌంట్ లు

టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవాణి ట్రస్ట్ కు రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటి కార్పస్ డొనేషన్ ఖాతా, రెండోది జనరల్ డొనేషన్ ఖాతా. కార్పస్ డొనేషన్ ఖాతాలో దాతలు ఇచ్చిన విరాళాన్ని ఫిక్సెడ్ డిపాజిట్, ఇన్వెస్ట్ మెంట్ చేసి దాని ద్వారా వచ్చిన వడ్డీతో శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తామని అంటున్నారు. ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలకు మరియు నిర్వహణ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులకు ఆ ఖాతోలోని డబ్బు ఉపయోగిస్తామని టీటీడీ క్లారిటీ ఇచ్చింది.

నేరుగా డబ్బు వాడుకోవచ్చు

నేరుగా డబ్బు వాడుకోవచ్చు

ఇది దీర్ఘకాలిక ప్రయోజనం కోసం దాతలు ఇచ్చే విరాళం.

శ్రీవాణి ట్రస్ట్ కు అవసరాన్ని బట్టి స్వల్ప కాలికంగా ట్రస్ట్ లక్ష్యం ప్రకారం వెంటనే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి చేయడం కోసం జనరల్ డొనేషన్స్ కూడా తీసుకోవడం ద్వారా ట్రస్ట్ యొక్క లక్ష్యాలు మరియు నిర్వహణ కోసం నేరుగా ఉపయోగించవచ్చని టీటీడీ తెలిపింది. జనరల్ డొనేషన్ అంటే వడ్డీతో పని లేకుండా దాతలు ఇచ్చిన విరాళాన్ని శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యాలకు మరియు నిర్వహణకు ఖర్చుల బట్టి నేరుగా వాడుకోవచ్చని టీటీడీ వివరించింది.

రెండింటి మధ్య ఇదే తేడా

రెండింటి మధ్య ఇదే తేడా

కార్పస్ డొనేషన్ ఖాతాలో జమ అయిన విరాళాన్ని ఫిక్స్ డిపాజిట్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చిన వడ్డీని మాత్రమే ట్రస్ట్ లక్ష్యాలకు మరియు నిర్వహణకు ఉపయోగిస్తారు. ఏదైతే జనరల్ డొనేషన్ అకౌంట్ లో ఉందో దానిని శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన జనరల్ డొనేషన్ అకౌంట్ లో జమ చేయబడుతుంది తప్పా టీటీడీ జనరల్ అకౌంట్ లో జమ చేయబడదని, ఈ విషయం భక్తులు గుర్తుంచుకోవాలని టీటీడీ మనవి చేసింది.

అందరికి రెండు అకౌంట్లు ఉన్నాయి

అందరికి రెండు అకౌంట్లు ఉన్నాయి

కార్పస్ డొనేషన్ ఖాతా ఫిక్స్ డిపాజిట్లు, ఇన్వెస్మెంట్ ల ద్వారా వచ్చే వడ్డీలతో రోజువారి ట్రస్ట్ లక్ష్యాలు మరియు నిర్వహణ ఖర్చులకు ఉపయోగించడం సాధ్యం కాదు కాబట్టి జనరల్ డొనేషన్ ఖాతా ద్వారా రోజువారి లక్ష్యాలు, నిర్వహణకు నేరుగా ఉపయోగించుకునే విధంగా ప్రతి ట్రస్టు రెండు ఖాతాలు వినియోగించుకుంటాయని టీటీడీ తెలిపింది. టీటీడీలో నిర్వహించే ప్రాణదానం, అన్నదానం ట్రస్ట్ లే కాకుండా మిగతా అన్ని ట్రస్టులు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాయి. ఈ పద్ధతి టీటీడీలోనే కాదు బయట నడపబడే ప్రైవేట్ ట్రస్టులు అన్నీ కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాయని టీటీడీ వివరించింది.

ఐటీ శాఖ క్లారిటీ ఇచ్చింది

ఐటీ శాఖ క్లారిటీ ఇచ్చింది

శ్రీవాణి ట్రస్ట్ అనేది భారత ఆదాయపుశాఖ కమిషన్ గుర్తించిన ఇన్కమ్ టాక్స్ అసెస్మెంట్ అయినా ట్రస్ట్ ఇది. అంతేకాకుండా శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన ప్రతి ఖాతాను ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలియపరుస్తాన్నామని టీటీడీ తెలిపింది. అదేవిధంగా ఆదాయపన్ను వారు ఈ మధ్యనే శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించిన ఖాతాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అంతా సవ్యంగా ఉందని ధృవీకరించారని టీటీడీ ఓ ప్రకనటనలో తెలిపింది.

దాతల కోరిక మేరకే

దాతల కోరిక మేరకే

దాతల కోరిక మేరకే విరాళాన్ని కార్పస్ లేదా జనరల్ డొనేషన్లుగా పరిగణించబడుతుంది.


ఇవన్నీ తెలుసుకోకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం టీటీడీ ఉన్నతాధికారులను, కోందరిని లక్ష్యంగా చేసుకున్న తిరుపతి వార్త అనే పత్రికకు చెందిన మాచర్ల శీను అనే వ్యక్తి దుష్ప్రచారం చేయడం అమానుషం అని, అన్నీ సక్రమంగా నడిచే శ్రీ వాణి ట్రస్టును వక్రబుద్ధితో నిర్వీర్యం చేయాలని వాళ్లు చూస్తున్నారని, మాచర్ల శీను లాంటి వ్యక్తులు చేసే దుష్ప్రచారాలను శ్రీవారి భక్తులు, మీడియా మిత్రులు ఎవరు కూడా నమ్మకండి అంటూ బుధవారం టీటీడీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది, అయితే ఈ విషయంలొ టీటీడీ యాజమాన్యం మాత్రం ఇంత వరకు నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.

English summary
Tirupati: TTD management has given clarity as to what is happening with Tirumala Srivani Trust donations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X