TTD: బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ- భక్తులకు టీటీడీ కీలక సూచనలు..!!

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) వైభవంగా జరుగుతున్నాయి. రేపు(శుక్రవారం) గరుడోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో అధిక సంఖ్యలో భక్తుల వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంది టీటీడీ. భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. లక్షలాది మంది భక్తులుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోది.

రేపు గరుడోత్సవం : బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు గరుడోత్సవం(Garudotsavam) జరగనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. మాడ వీధుల్లో భక్తులకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేసారు. గరుడ సేవకు ఉన్న ప్రాధాన్యత కారణంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక సూచనలు చేసింది.

TTD new instructions for devotees in view of the heavy turnout of pilgrims for Garuda Seva on September 22

21వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ద్విచక్రవాహనాలకు అనుమతి రద్దు చేశారు. తిరుమల(Tirumala)లో GNC నుండి వాహనాలు పార్కింగ్ ప్రాంతాలను ప్రకటించారు. వీవీఐపీ పెద్ద బ్యాడ్జులతో వచ్చే వాహనాలకు రాంభగీచ వద్ద పార్కంగ్ కల్పించారు. వీఐపీ చిన్న బ్యాడ్జీలు ఉన్న వాహనాలకు ముల్లగుంట, సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్ ప్రాంతాలుగా వెల్లడించారు.

భద్రతా ఏర్పాట్లు : సాధారణ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా పార్కింగ్ ప్రాంతాలకు దారి మళ్ళించనున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి(Tirupati) ఆర్టీసీ అధికారులు బస్ స్టాండ్ నుండే కాకుండా తిరుపతిలోని ముఖ్యమైన కూడళ్ల నుంచి బస్సులను తిరుమల(Tirumala)కు ఏర్పాటు చేశారు. పార్కింగ్‌కి ముందుగా పోలీసులు పాస్‌లు కేటాయించనున్నారు. చెన్నై నుండి వచ్చే వాహనాలకు వడమాల పేట టోల్ ప్లాజా వద్ద ఉన్న అగస్త్య ఎన్‌క్లేవ్‌ తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ ను పార్కింగ్ ప్రాంతంగా నిర్ణయించారు.

కడప నుండి వచ్చే వాహనాలకు కుక్కల దొడ్డి వద్ద ఉన్న కేశవరెడ్డి హై స్కూల్, కరకంబాడి వద్ద ఉన్న ఎస్.వి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణాన్ని ఎంపిక చేసారు. చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు చంద్రగిరి సమీపంలో ఉన్న ఐతే పల్లి, జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్ వద్ద పార్కింగ్ వసతి కల్పించారు.

TTD new instructions for devotees in view of the heavy turnout of pilgrims for Garuda Seva on September 22

పార్కింగ్ ప్రదేశాలు : మదనపల్లి నుండి వచ్చే వాహనాలకు విధ్యానికేతన్ కాలేజి సమీపంలో ఉన్న కే.ఎం.ఎం కాలేజ్, జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్ వద్దే వాహనాలను పార్క్(Parking Places ) చేసుకోవాలి. శ్రీకాళహస్తి నుండి వచ్చే వాహనాలకు రేణిగుంట సమీపంలో ఉన్న ఆర్ మల్లవరం పెట్రోల్ బంక్ వద్ద, తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డు లో పార్కింగ్ ఉంటుంది. కరకంబాడి వద్ద ఉన్న ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల పార్కింగ్ పాసులు కేటాయిస్తారని అధికారులు వెల్లడించారు.

జూ పార్క్ రోడ్డులో ఉన్న దేవలోక్, భారతీయ విద్యాభవన్‌, మెటర్నిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్, ఎస్.వి మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్‌ల యందు టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ పార్కింగ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ వద్ద కేవలం ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ అనుమతి ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+