డిజిటలైజేషన్: వెంకన్న ఆస్తుల రక్షణకు టిటిడి ప్లాన్ ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుమల: భక్తుల కోర్కెలు తీర్చే తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఉన్న ఆస్తుల విలువ లెక్కేలేదు. అయితే బాలాజీ స్వామి ఆస్తులను పరిరక్షించాలని టిటిడి సంకల్పించింది. భక్తులు ఇచ్చే కానులు, ఆస్తులను జాగ్రత్త చేయాలని టిటిడి అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలోని ఏడుకొండల వెంకన్న ఆస్తులకు లెక్కే లేదు.ఆ దేవుడికి భక్తులు సమర్పించే కానుకలు, వస్తువులను భద్రపర్చేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని టిటిడి నిర్ణయం తీసుకొంది.

అయితే వెంకన్న స్వామి ఆస్తులను డిజిటలైజేషన్ చేయాలని టిటిడి అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఆస్తులన్నింటిని భద్రపర్చేందుకు టిటిడి ఈ నిర్ణయం తీసుకొంది.

టిటిడి ఆస్తుల డిజిటలైజేషన్

టిటిడి ఆస్తుల డిజిటలైజేషన్


ఏడుకొండల వెంకటేశ్వరస్వామి ఆస్తులకు లెక్కేలేదు. వందల కోట్ల ఆస్తులు వెంకటేశ్వరస్వామికి ఉంటాయి.భక్తులు దేవ దేవుడికి సమర్పించే కానుకలు చాలా అమూల్యమైనవి.కానుకల రూపంలో సమర్పించిన భూములు, భవనాలు, ఇతర ఆస్తులు 4,143 ఎకరాలున్నాయని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.డిజిటలైజ్‌ చేయటం ద్వారా ఈ ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలని టీటీడీ సంకల్పించింది.

భక్తుల ద్వారా ప్రతి రోజూ రూ. 3 కోట్లు

భక్తుల ద్వారా ప్రతి రోజూ రూ. 3 కోట్లు

శ్రీవారికి భక్తుల నుంచి నిత్యం నగదు, కానుకలు, ఆభరణాల రూపంలో సుమారు రూ.3 కోట్లపైబడి అందుతున్నాయి. వీటితోపాటు భూములు, భవనాలు, ఇతర ఆస్తులు కూడా సమర్పిస్తూ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు.. 2009లో హైకోర్టు ఆదేశాలతో స్వామివారి ఆస్తుల జాబితాను టీటీడీ అధికారులు కోర్టుకు సమర్పించారు.

వెంకన్న ఆస్తుల అన్యాక్రాంతం

వెంకన్న ఆస్తుల అన్యాక్రాంతం

తిరుమల వెంకన్నకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ ఆస్తులున్నాయి దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలతోపాటు నేపాల్‌లోనూ ఆస్తులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 88% ఆస్తులు, ఉత్తరాదిన 11%, నేపాల్‌లో 1 శాతం ఆస్తులున్నాయి. ఇందులో కొన్ని అన్యాక్రాంతం అవుతున్నట్టు విమర్శలున్నాయి. ఆస్తులు లీజు పద్ధతిలో ఉన్నా అద్దెలు సక్రమంగా వసూలు కావటం లేదు. మరికొన్ని ఆస్తులు టీటీడీ ఖాతాలో ఉన్నప్పటికీ కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి.

ఆస్తులకు భద్రత కోసమిలా..

ఆస్తులకు భద్రత కోసమిలా..

డిజిటలైజ్‌ చేయటం ద్వారా లక్షల కోట్ల విలువైన శ్రీవారి ఆస్తులకు రక్షణ కల్పించాలని ధార్మిక సంస్థ టీటీడీ నిర్ణయించింది. సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా సంపూర్ణంగా డిజిటల్‌ చేసి పర్యవేక్షించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. 2018 మార్చి నాటికి ఆస్తుల డేటాను సిద్ధం చేయాలని నిర్దేశించారు. దీంతో దేవస్థానం రెవెన్యూ, ఐటీ విభాగాలు స్వామి ఆస్తులను డిజిటల్‌ చేయటంలో నిమగ్నమయ్యాయి. అందుబాటులో ఉన్న రికార్డులతోపాటు శ్రీవారికి ఉన్న స్థిర, చరాస్తుల ఫొటోల డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTD planning to protect assets through digitalisation. officers will gather assets information of TTD
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి